Title (Indic)తనకే సంతోసమైతే దప్పితో నేనుండరాదా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తనకే సంతోసమైతే దప్పితో నేనుండరాదా పొనిఁగి యెట్టుంటిమేమి పొమ్మనరాదా (॥॥) రాకుంటేఁ దా మానెఁగాక రతిరాజుయేట్లకు చేకొని ములుగరాదా సిగ్గులో నేము ఆకెకే మోహించుఁగాక ఆపసోపపుఁ దాపాన చీకాకుపడి నాలోఁజిన్నఁబోరాదా (॥॥) పవ్వళించుఁగాక తాను పంచలనే కాచుకుండి అవ్వల నాలో నుస్సురనఁగరాదా దవ్వులైతే నాయఁగాక తలఁపులో తన్నుఁజూచి పువ్వువంటి కోరికతో పొద్దుగడపరాదా (॥॥) పరాకైతే నాయుఁగాక పట్టి తనకాఁగిటిలో సరాగానఁ గూరిములు చల్లఁగరాదా విరాళిఁ గూడెను శ్రీవేంకటేశుఁడిటు నన్ను సురాళమైనరతిఁజోక్కి వుండరాదా English(||pallavi||) tanage saṁtosamaide dappido nenuṁḍarādā pŏnim̐gi yĕṭṭuṁṭimemi pŏmmanarādā (||||) rāguṁṭem̐ dā mānĕm̐gāga radirājuyeṭlagu segŏni mulugarādā siggulo nemu āgĕge mohiṁchum̐gāga ābasobabum̐ dābāna sīgāgubaḍi nālom̐jinnam̐borādā (||||) pavvaḽiṁchum̐gāga tānu paṁchalane kāsuguṁḍi avvala nālo nussuranam̐garādā davvulaide nāyam̐gāga talam̐pulo tannum̐jūsi puvvuvaṁṭi korigado pŏddugaḍabarādā (||||) parāgaide nāyum̐gāga paṭṭi tanagām̐giḍilo sarāgānam̐ gūrimulu sallam̐garādā virāḽim̐ gūḍĕnu śhrīveṁkaḍeśhum̐ḍiḍu nannu surāḽamainaradim̐jokki vuṁḍarādā