Title (Indic)తలఁప వెనక నుయ్యి తగరు ముందట(?) దీనఁ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తలఁప వెనక నుయ్యి తగరు ముందట(?) దీనఁ దొలఁగ నాకుఁ దెరువు దోపఁ దేమి సేతు (॥తలఁ॥) మమకార విముక్తి మార్గదూరము నీపై మమతసేయక నాకు మనరాదు మమత మేలో నిర్మమత మేలో దీని- క్రమమున క్రమము నేఁ గాన నేమి సేతు (॥తలఁ॥) కర్మమార్గము జన్మగతికిఁ జేరువ ని- ష్కర్మము పాతకమునకుఁ దొడవు కర్మిగావలెనో నిష్కర్మి గావలెనో యీ- మర్మంపు మదము మాన దేమిసేతు (॥తలఁ॥) శరణాగత రక్షకుడవైనయట్టి తిరువేంకటగిరిదేవుఁడా పరిపూర్ణఁడవో నీవు పరిచ్ఛిన్నుఁడవో ని- న్నరసి భజింపలేనైతి నేమిసేతు English(||pallavi||) talam̐pa vĕnaga nuyyi tagaru muṁdaḍa(?) dīnam̐ dŏlam̐ga nāgum̐ dĕruvu dobam̐ demi sedu (||talam̐||) mamagāra vimukti mārgadūramu nībai mamadaseyaga nāgu manarādu mamada melo nirmamada melo dīni- kramamuna kramamu nem̐ gāna nemi sedu (||talam̐||) karmamārgamu janmagadigim̐ jeruva ni- ṣhkarmamu pādagamunagum̐ dŏḍavu karmigāvalĕno niṣhkarmi gāvalĕno yī- marmaṁpu madamu māna demisedu (||talam̐||) śharaṇāgada rakṣhaguḍavainayaṭṭi tiruveṁkaḍagiridevum̐ḍā paribūrṇam̐ḍavo nīvu parichchhinnum̐ḍavo ni- nnarasi bhajiṁpalenaidi nemisedu