Title (Indic)తానేడ ఆతఁడేడ దయలు దలఁచ వచ్చీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తానేడ ఆతఁడేడ దయలు దలఁచ వచ్చీ యీ నెపానఁ గంటిమిగా యివి గొన్ని సుద్దులు (॥తానే॥) నగుతా నాతనినంటే నాతో నీపె వాదించీ తగవు చెప్పరే మీరు తనమగఁడా జిగితో నేనేకతానఁ జేసేటి చేఁతలవేళ అగపడి తానప్పుడడ్డాలువచ్చీనా (॥తానే॥) కొప్పు నేజారఁదీసితే కురులు దాఁగూడదువ్వీ తప్పక చెప్పరే మీరు తనమగఁడా చిప్పిలు రతులలోనఁ జీకాకు సేసేటివేళ అప్పటివలెనే తావహించుకవచ్చీనా (॥తానే॥) చెమరించ నేఁగూడితే చేరి తావిసరవచ్చీ తమకించక చెప్పరే తనమగఁడా జమళి శ్రీవేంకటేశు సాదించేటి యట్టివేళ గమిగూడుకొని తాను కావఁగవచ్చీనా English(||pallavi||) tāneḍa ādam̐ḍeḍa dayalu dalam̐sa vachchī yī nĕbānam̐ gaṁṭimigā yivi gŏnni suddulu (||tāne||) nagudā nādaninaṁṭe nādo nībĕ vādiṁchī tagavu sĕppare mīru tanamagam̐ḍā jigido nenegadānam̐ jeseḍi sem̐talaveḽa agabaḍi tānappuḍaḍḍāluvachchīnā (||tāne||) kŏppu nejāram̐dīside kurulu dām̐gūḍaduvvī tappaga sĕppare mīru tanamagam̐ḍā sippilu radulalonam̐ jīgāgu seseḍiveḽa appaḍivalĕne tāvahiṁchugavachchīnā (||tāne||) sĕmariṁcha nem̐gūḍide seri tāvisaravachchī tamagiṁchaga sĕppare tanamagam̐ḍā jamaḽi śhrīveṁkaḍeśhu sādiṁcheḍi yaṭṭiveḽa gamigūḍugŏni tānu kāvam̐gavachchīnā