Title (Indic)తానే యింత జాణ గాని తలఁప నే మెడ్డెలమా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తానే యింత జాణ గాని తలఁప నే మెడ్డెలమా ఆనుక యూరకుండితే అరసత్తి దాననా (॥తానే॥) సిగ్గు వడి యుండఁగానే చీర యేల పట్టీనే వెగ్గళించ కుండితే నేవుఱ్ఱివారమా కగ్గి మాయింటికిఁ బోఁగా గంద మేల పూసీనే యెగ్గులఁ దిట్టకుండితే యియ్యకొన్నదానవా (॥తానే॥) మాటలాడఁకుండ గానే మమ్ము నేల తడవీనే వీట మావారు లేకున్న వెలయాలనా నీటున నే నుండఁగానే నిలి చేల నవ్వీనే గీటి గోరఁ జించకున్నకిందుపడ్డ దాననా (॥తానే॥) కన్నులు మూసుకుండఁగ కౌఁగిట నేల నించీనే పిన్నతనాన నే నుంటే పెట్టుఁ జెట్టనా వున్నతి శ్రీవేంకటేశుఁ డిక్కటై యేల మెచ్చీనే సన్నలు సేయకుండితే చలపట్టేదాననా English(||pallavi||) tāne yiṁta jāṇa gāni talam̐pa ne mĕḍḍĕlamā ānuga yūraguṁḍide arasatti dānanā (||tāne||) siggu vaḍi yuṁḍam̐gāne sīra yela paṭṭīne vĕggaḽiṁcha kuṁḍide nevuṭrivāramā kaggi māyiṁṭigim̐ bom̐gā gaṁda mela pūsīne yĕggulam̐ diṭṭaguṁḍide yiyyagŏnnadānavā (||tāne||) māḍalāḍam̐kuṁḍa gāne mammu nela taḍavīne vīḍa māvāru legunna vĕlayālanā nīḍuna ne nuṁḍam̐gāne nili sela navvīne gīḍi goram̐ jiṁchagunnagiṁdubaḍḍa dānanā (||tāne||) kannulu mūsuguṁḍam̐ga kaum̐giḍa nela niṁchīne pinnadanāna ne nuṁṭe pĕṭṭum̐ jĕṭṭanā vunnadi śhrīveṁkaḍeśhum̐ ḍikkaḍai yela mĕchchīne sannalu seyaguṁḍide salabaṭṭedānanā