Title (Indic)తానె తలఁచుకొని తగిలి మన్నించీఁ గాని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తానె తలఁచుకొని తగిలి మన్నించీఁ గాని మోనముతో మోముచూపి మొత్తమున రావే (॥తానె॥) మున్నిటి తన మాటలు ముదులకించి రావే అన్నిటా తన సన్నలు అడిగి రావే చన్నులు నేలమోవ సాగిలి మొక్కి రావే వున్నతిని చేకానికె వొద్దఁబెట్టి రావే (॥తానె॥) అప్పుడు నేఁగన్నకల ఆతనితోఁ జెప్పి రావే వొప్పుగాను మనసంతయు నొరసి రావే విప్పుచుఁ బెదవులను వినయము చూపి రావే అప్పటి గోడ గురుతు నటు వ్రాసి రావే (॥తానె॥) సంగడి నుండిన వారి సాకిరివెట్టి రావే కంగులేక తనబుద్ధి కైకొని రావే చెంగటికి తానే వచ్చి శ్రీవేంకటేశుఁడు గూడె సంగతాయననిమెచ్చి సరసకు రావే English(||pallavi||) tānĕ talam̐sugŏni tagili manniṁchīm̐ gāni monamudo momusūbi mŏttamuna rāve (||tānĕ||) munniḍi tana māḍalu mudulagiṁchi rāve anniḍā tana sannalu aḍigi rāve sannulu nelamova sāgili mŏkki rāve vunnadini segānigĕ vŏddam̐bĕṭṭi rāve (||tānĕ||) appuḍu nem̐gannagala ādanidom̐ jĕppi rāve vŏppugānu manasaṁtayu nŏrasi rāve vippusum̐ bĕdavulanu vinayamu sūbi rāve appaḍi goḍa gurudu naḍu vrāsi rāve (||tānĕ||) saṁgaḍi nuṁḍina vāri sāgirivĕṭṭi rāve kaṁgulega tanabuddhi kaigŏni rāve sĕṁgaḍigi tāne vachchi śhrīveṁkaḍeśhum̐ḍu gūḍĕ saṁgadāyananimĕchchi sarasagu rāve