Title (Indic)తానే సిగ్గువడఁగ తప్పు లెందుఁ బట్టుదునే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తానే సిగ్గువడఁగ తప్పు లెందుఁ బట్టుదునే కానీవే అన్నిటా తారుకాణకు గురెవ్వరే (॥తానే॥) చిక్కనినవ్వులతోడ శిరసు దా వంచఁగాను యెక్కువమదనముద్ర లెందువోవునే ముక్కుమీఁది వేలితోడ మోసముతో నుండఁగాను మక్కువ నామాఁటకు మాటాడేవారెవ్వరే (॥తానే॥) చిరుగుఁగెమ్మోవితోడ చెక్కునఁ జేయిడుకోఁగా అగడుగా నాతోఁ బెండ్లాడే దెప్పుడే మొగము చూచి తాను మొక్కులు దా మొక్కఁగాను మొగమాట తిట్లెల్ల మోఁచే దెక్కడనే (॥తానే॥) నంటుసేసుకొని తాను నన్నుఁ గాగిలించుకోఁగా వుంటనింట మరువా ట్లొడ్డేదెపుడే దంట శ్రీవేంకటేశుడు తానే వచ్చి నన్నుఁ గూడె బంట పంతములెల్లానుఁ బచరించే దెప్పుడే English(||pallavi||) tāne sigguvaḍam̐ga tappu lĕṁdum̐ baṭṭudune kānīve anniḍā tārugāṇagu gurĕvvare (||tāne||) sikkaninavvuladoḍa śhirasu dā vaṁcham̐gānu yĕkkuvamadanamudra lĕṁduvovune mukkumīm̐di velidoḍa mosamudo nuṁḍam̐gānu makkuva nāmām̐ṭagu māḍāḍevārĕvvare (||tāne||) sirugum̐gĕmmovidoḍa sĕkkunam̐ jeyiḍugom̐gā agaḍugā nādom̐ bĕṁḍlāḍe dĕppuḍe mŏgamu sūsi tānu mŏkkulu dā mŏkkam̐gānu mŏgamāḍa tiṭlĕlla mom̐se dĕkkaḍane (||tāne||) naṁṭusesugŏni tānu nannum̐ gāgiliṁchugom̐gā vuṁṭaniṁṭa maruvā ṭlŏḍḍedĕbuḍe daṁṭa śhrīveṁkaḍeśhuḍu tāne vachchi nannum̐ gūḍĕ baṁṭa paṁtamulĕllānum̐ basariṁche dĕppuḍe