Title (Indic)తానే నామీఁదటఁ దొల్లె దయగలఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తానే నామీఁదటఁ దొల్లె దయగలఁడు కానిమ్మని వొడఁబడేఁ గపట మేఁటికే (॥తానే॥) బాఁటుదప్పే మావాఁడా తాను మఱవ నేననరే యేఁటికి వానలు వెట్టీ యీంతలోననే చాటిచెప్పీఁ దనడాగు చన్నుల పైననరే కోటికిఁ బడగెత్తె కొసరనేమిటికే (॥తానే॥) మేలెంచనివాడా తాను మేకొంటిననరే యీలాగునేల మొక్కీ ఇంతలోననే వోలవేసీ నావేల నుంగర మీదెనరే యీలాగుచనవులందు యెరవు లేమిటికే. (॥తానే॥) సిగ్గువడేవాఁడా తాను చెనకితి ననరే యెగ్గులేకనన్నుఁ గూడె ఇంతలోననే అగ్గమై శ్రీవేంకటేశుఁడల మేలుమంగ అగ్గలమాయ వలపు అలయనేమిటికే English(||pallavi||) tāne nāmīm̐daḍam̐ dŏllĕ dayagalam̐ḍu kānimmani vŏḍam̐baḍem̐ gabaḍa mem̐ṭige (||tāne||) bām̐ṭudappe māvām̐ḍā tānu maṟava nenanare yem̐ṭigi vānalu vĕṭṭī yīṁtalonane sāḍisĕppīm̐ danaḍāgu sannula painanare koḍigim̐ baḍagĕttĕ kŏsaranemiḍige (||tāne||) melĕṁchanivāḍā tānu megŏṁṭinanare yīlāgunela mŏkkī iṁtalonane volavesī nāvela nuṁgara mīdĕnare yīlāgusanavulaṁdu yĕravu lemiḍige. (||tāne||) sigguvaḍevām̐ḍā tānu sĕnagidi nanare yĕgguleganannum̐ gūḍĕ iṁtalonane aggamai śhrīveṁkaḍeśhum̐ḍala melumaṁga aggalamāya valabu alayanemiḍige