Title (Indic)తానే నాకు మాట యిచ్చెఁ దనచిత్తము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తానే నాకు మాట యిచ్చెఁ దనచిత్తము మోనముతో నలిగేనా ముద్దరాల నేను (॥తానే॥) మనసు వచ్చినాపెను మన్నించుమనవే తనను వొద్దనేనా పంతమున నేను ననిచి యెవ్వతెతోనైనా నవ్వుమనవె పెనఁగి కోపగించేనా ప్రియురాల నేను (॥తానే॥) యేకాంతకైనాను యిచ్చక మాడుమనవే కాకు సేసేనా తన్నుఁ గడవారితో మేకుల కండసతిని మెచ్చు మెచ్చుమనవే దీకొని వాదించేనా దేవులను నేను (॥తానే॥) వలసినవారిని వలపించుకొమ్మనవే చలమునఁ గాదనేనా సారెకు నేను అలమి శ్రీవేంటేశుఁ డాదరించి నన్నుఁగూడె యెలమి నిఁక దూరేనా ఇల్లాల నేను English(||pallavi||) tāne nāgu māḍa yichchĕm̐ danasittamu monamudo naligenā muddarāla nenu (||tāne||) manasu vachchinābĕnu manniṁchumanave tananu vŏddanenā paṁtamuna nenu nanisi yĕvvadĕdonainā navvumanavĕ pĕnam̐gi kobagiṁchenā priyurāla nenu (||tāne||) yegāṁtagainānu yichchaga māḍumanave kāgu sesenā tannum̐ gaḍavārido megula kaṁḍasadini mĕchchu mĕchchumanave dīgŏni vādiṁchenā devulanu nenu (||tāne||) valasinavārini valabiṁchugŏmmanave salamunam̐ gādanenā sārĕgu nenu alami śhrīveṁṭeśhum̐ ḍādariṁchi nannum̐gūḍĕ yĕlami nim̐ka dūrenā illāla nenu