Title (Indic)తాముఁ దా మెరఁగరా తరవాతిపనులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తాముఁ దా మెరఁగరా తరవాతిపనులు దోమటి వారిబుద్దుల తోడనేలే ఇఁకను (॥తాము॥) ఇంతిమోము చూచి మోహ మీతనిపైఁ జల్లె నిదె అంతలో నవ్వు లీతఁ డాపెపైఁ జల్లె వింత లిద్దరికి లేవు వేడుకచెలుల మింతే మంతనపు విన్నపాలు మనకేలే ఇఁకను (॥తాము॥) వెలఁది యీవిభునికి వీడెము చేతికిచ్చె చెలువుఁ డాకుమడిని చెలికిచ్చెను తలఁపు లిద్దరికిని తారుకాణలాయ నిదె చలివాసె వేఁడుకొనుఁ సారేనేలే మనకు (॥తాము॥) అంగన శ్రీ వేంకటేశు నంకెలఁ గాఁగిలించె సంగతి నాతఁడే కూడి చనవిచ్చెను ఇంగితాన నిద్దరికి యెరవులు లేవిఁక ముంగిటనున్న మనకు మొరఁగేలే యిఁకను English(||pallavi||) tāmum̐ dā mĕram̐garā taravādibanulu domaḍi vāribuddula toḍanele im̐kanu (||tāmu||) iṁtimomu sūsi moha mīdanibaim̐ jallĕ nidĕ aṁtalo navvu līdam̐ ḍābĕbaim̐ jallĕ viṁta liddarigi levu veḍugasĕlula miṁte maṁtanabu vinnabālu managele im̐kanu (||tāmu||) vĕlam̐di yīvibhunigi vīḍĕmu sedigichchĕ sĕluvum̐ ḍāgumaḍini sĕligichchĕnu talam̐pu liddarigini tārugāṇalāya nidĕ salivāsĕ vem̐ḍugŏnum̐ sārenele managu (||tāmu||) aṁgana śhrī veṁkaḍeśhu naṁkĕlam̐ gām̐giliṁchĕ saṁgadi nādam̐ḍe kūḍi sanavichchĕnu iṁgidāna niddarigi yĕravulu levim̐ka muṁgiḍanunna managu mŏram̐gele yim̐kanu