Title (Indic)తాము స్వతంత్రులు గారు తమయంతను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తాము స్వతంత్రులు గారు తమయంతను ఆ మీఁదటి గురి అది నీవు (॥తాము॥) యెలమి స్వర్గమేలేటి ఇంద్రునికినైనాను అలమి కోరేటి ఫలమది నీవు బలిమిఁ గైలాసమేలే పతి రుద్రునికినైనా నిలుకడైన పదము నీ పదము (॥తాము॥) యెక్కుడు సత్యలోకము యేలే బ్రహ్మకునైనా ఇక్కువఁ జేరేచోటు యెందును నీవు వెక్కసపుఁ బుణ్యముల వేదములకైనాను అక్కరతో ముఖ్యమైన అర్థమెల్లా నీవు (॥తాము॥) నాఁడు నాఁడే ముక్తులైన నారదశుకాదులకు నేఁడును విహరించే నెలవు నీవు పోఁడిమి శ్రీవేంకటేశ పోలించ నెవ్వరూ లేరు మూడులోకముల నీవే మూలము నీవే English(||pallavi||) tāmu svadaṁtrulu gāru tamayaṁtanu ā mīm̐daḍi guri adi nīvu (||tāmu||) yĕlami svargameleḍi iṁdruniginainānu alami koreḍi phalamadi nīvu balimim̐ gailāsamele padi rudruniginainā nilugaḍaina padamu nī padamu (||tāmu||) yĕkkuḍu satyalogamu yele brahmagunainā ikkuvam̐ jeresoḍu yĕṁdunu nīvu vĕkkasabum̐ buṇyamula vedamulagainānu akkarado mukhyamaina ardhamĕllā nīvu (||tāmu||) nām̐ḍu nām̐ḍe muktulaina nāradaśhugādulagu nem̐ḍunu vihariṁche nĕlavu nīvu pom̐ḍimi śhrīveṁkaḍeśha poliṁcha nĕvvarū leru mūḍulogamula nīve mūlamu nīve