Title (Indic)తాము స్వతంత్రులు గారు 'దాసోహము' ననలేరు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తాము స్వతంత్రులు గారు 'దాసోహము' ననలేరు పామరపుదేహులకు పట్టరాదు గర్వము (॥తాము॥) పరగు బ్రహ్మాదులు బ్రహ్మమే తా మనలేరు హరికే మొరవెట్టేరు ఆపదైతేను ధరలో మనుజులింతే తామే దయివమనేరు పొరిఁ దాము చచ్చి పుట్టే పొద్దెరఁగరు (॥తాము॥) పండిన వ్యాసాదులు ప్రపంచము కల్లనరు కొండలుగాఁ బురాణాలఁ గొనియాడేరు అండనే తిరిపెములై అందరి నడిగి తా- ముండుండి లేదనుకొనే రొప్పదన్నా మానరు (॥తాము॥) సనకాది యోగులు శౌరిభక్తి సేసేరు దు- ర్జనులు భక్తి వొల్లరు జ్ఞానులమంటా నినుపయి శ్రీవేంకటేశ నినుఁ జేరి మొక్కుతానే అనిశము నిరాకారమనేరు యీ ద్రోహులు English(||pallavi||) tāmu svadaṁtrulu gāru 'dāsohamu' nanaleru pāmarabudehulagu paṭṭarādu garvamu (||tāmu||) paragu brahmādulu brahmame tā manaleru harige mŏravĕṭṭeru ābadaidenu dharalo manujuliṁte tāme dayivamaneru pŏrim̐ dāmu sachchi puṭṭe pŏddĕram̐garu (||tāmu||) paṁḍina vyāsādulu prabaṁchamu kallanaru kŏṁḍalugām̐ burāṇālam̐ gŏniyāḍeru aṁḍane tiribĕmulai aṁdari naḍigi tā- muṁḍuṁḍi ledanugŏne rŏppadannā mānaru (||tāmu||) sanagādi yogulu śhauribhakti seseru du- rjanulu bhakti vŏllaru jñānulamaṁṭā ninubayi śhrīveṁkaḍeśha ninum̐ jeri mŏkkudāne aniśhamu nirāgāramaneru yī drohulu