Title (Indic)తామొకరి నాడుదురు తమనేరా లెంచుకోరు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తామొకరి నాడుదురు తమనేరా లెంచుకోరు భూమిలో నిట్లఁ గాఁగానే పో కౌను సమసె (॥తాము॥) కాదనేటిదాననా కడు నీవు నవ్వితేను సోదించి నీమోవి నీవే చూచుకోరాదా యీదె నీభావ మయ్యా యెదుటిచందురుకందు నాదించేకన్నులు తననలుపు లెంచీనా (॥తాము॥) వేసరేటిదాననా వెంగేలు నీ వాడితేను యీసు నీగుణము నీవే యెంచుకోరాదా మోసాన జలనిధిని మునినోరియెంగిలనే - వూసివాసినోరు తనవొద్దియెంగి లెంచీనా (॥తాము॥) వంతుకెంచేదాననా వచ్చి నీవు గూడఁగాను ఇంతలో నావరుస నీవెంచుకోరాదా పంతపు శ్రీవేంకటేశ పైకొని కూడితి నన్ను దొంతి తన నీడ తోడువాసి వుండునా English(||pallavi||) tāmŏgari nāḍuduru tamanerā lĕṁchugoru bhūmilo niṭlam̐ gām̐gāne po kaunu samasĕ (||tāmu||) kādaneḍidānanā kaḍu nīvu navvidenu sodiṁchi nīmovi nīve sūsugorādā yīdĕ nībhāva mayyā yĕduḍisaṁdurugaṁdu nādiṁchegannulu tananalubu lĕṁchīnā (||tāmu||) vesareḍidānanā vĕṁgelu nī vāḍidenu yīsu nīguṇamu nīve yĕṁchugorādā mosāna jalanidhini muninoriyĕṁgilane - vūsivāsinoru tanavŏddiyĕṁgi lĕṁchīnā (||tāmu||) vaṁtugĕṁchedānanā vachchi nīvu gūḍam̐gānu iṁtalo nāvarusa nīvĕṁchugorādā paṁtabu śhrīveṁkaḍeśha paigŏni kūḍidi nannu dŏṁti tana nīḍa toḍuvāsi vuṁḍunā