Title (Indic)తామెరయాఁటదియును భువిలో దప్పులఁ బొరలఁగఁ గలదా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తామెరయాఁటదియును భువిలో దప్పులఁ బొరలఁగఁ గలదా కామించిన తన కులపురుషుని కరముల నలమినఁ గాకా (॥తామెర॥) ఇందుకళామౌళికి నతనుని కేకాలము వైరము గాదా కందువతో బున్నమ గాఁగా గండము గడచే ముందరనె యెనసెటిశరములముం బారముగడపఁగవసమా అందముగా నడుములయమ్ములు అసిఁ బోయఁ గాకా (॥తామెర॥) కమలోత్పత్తికి హిమరుతువుకుఁ గలకాలము వైరము గాదా అమలాంబరమునుఁ గూడఁగ నాపద గడచే అమరంగాఁ జక్రముఁ బాపిన అదియునుఁ గడవఁగవశమా క్రమమునహంసాగమమునఁ గడతేరెఁ గాకా (॥తామెర॥) నీలాంబుదశిఖకును గాలికి నిక్కముగా వైరము గాదా మేలిమి మీఁదటి యోగము పేర్మినీబాదలు గడచే ఆలించిన నదియ అపూర్వం బైననుఁ గడవఁగ వశమా తాలిమి శ్రీవెంకటనాథుఁడు తాఁగూడఁగ బ్రతికెఁ గాకా. English(||pallavi||) tāmĕrayām̐ṭadiyunu bhuvilo dappulam̐ bŏralam̐gam̐ galadā kāmiṁchina tana kulaburuṣhuni karamula nalaminam̐ gāgā (||tāmĕra||) iṁdugaḽāmauḽigi nadanuni kegālamu vairamu gādā kaṁduvado bunnama gām̐gā gaṁḍamu gaḍase muṁdaranĕ yĕnasĕḍiśharamulamuṁ bāramugaḍabam̐gavasamā aṁdamugā naḍumulayammulu asim̐ boyam̐ gāgā (||tāmĕra||) kamalotpattigi himaruduvugum̐ galagālamu vairamu gādā amalāṁbaramunum̐ gūḍam̐ga nābada gaḍase amaraṁgām̐ jakramum̐ bābina adiyunum̐ gaḍavam̐gavaśhamā kramamunahaṁsāgamamunam̐ gaḍaderĕm̐ gāgā (||tāmĕra||) nīlāṁbudaśhikhagunu gāligi nikkamugā vairamu gādā melimi mīm̐daḍi yogamu perminībādalu gaḍase āliṁchina nadiya abūrvaṁ bainanum̐ gaḍavam̐ga vaśhamā tālimi śhrīvĕṁkaḍanāthum̐ḍu tām̐gūḍam̐ga bradigĕm̐ gāgā.