Title (Indic)తామె యెఱుగుదురు తమతమ భావము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తామె యెఱుగుదురు తమతమ భావము చే ముంచి యెవ్వరికిని చెప్పఁ జూపరాదు (॥తామె॥) మంతనపు పతిమాట మనసునఁ దలఁచుక చింతించి చింతించి తానే సెలవి నవ్వె వింత లీచెలివి చూచి వెరగయ్యీ నీవేళ అంతరంగములోపను లవి యెటువంటివో (॥తామె॥) కన్నుల జేసిన సన్నకాయమున మెరమంగ తన్నుఁ దానే పులకించి తలయూఁచీని అన్నిటా నేమిందుకే ఆయములు గరఁగేము మున్నీటి వొఁడబాట్ల ముచ్చట లెట్టివో (॥తామె॥) దగ్గర వచ్చిన మేలు తమకాన బోరుగఁగా సిగ్గుతోడ గొంకికొంకి చేయివట్టెను అగ్గమై శ్రీవేంకటేశు డంగన గూడె మెచ్చితి- మెగ్గుదప్పులేనితమయెనయిక లెట్టివో English(||pallavi||) tāmĕ yĕṟuguduru tamadama bhāvamu se muṁchi yĕvvarigini sĕppam̐ jūbarādu (||tāmĕ||) maṁtanabu padimāḍa manasunam̐ dalam̐suga siṁtiṁchi siṁtiṁchi tāne sĕlavi navvĕ viṁta līsĕlivi sūsi vĕragayyī nīveḽa aṁtaraṁgamulobanu lavi yĕḍuvaṁṭivo (||tāmĕ||) kannula jesina sannagāyamuna mĕramaṁga tannum̐ dāne pulagiṁchi talayūm̐sīni anniḍā nemiṁduge āyamulu garam̐gemu munnīḍi vŏm̐ḍabāṭla muchchaḍa lĕṭṭivo (||tāmĕ||) daggara vachchina melu tamagāna borugam̐gā siggudoḍa gŏṁkigŏṁki seyivaṭṭĕnu aggamai śhrīveṁkaḍeśhu ḍaṁgana gūḍĕ mĕchchidi- mĕggudappulenidamayĕnayiga lĕṭṭivo