Title (Indic)తాలిమి చక్కన గాని తమక మెం తైనాఁ గద్దు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తాలిమి చక్కన గాని తమక మెం తైనాఁ గద్దు మేల మాడవయ్య చెలి మీఁద మీఁద నున్నది (॥తాలిమి॥) వనితి పువ్వులవేసి వలపు నీపైఁ బూసి తనుఁ దానె సిగ్గుపడి తల వంచీని మనసు నీపై బెట్టి మాఁటలు మాతో నాడీ పెనఁగి పిలువవయ్య పేరుకొని నీవు (॥తాలిమి॥) పడఁతి నీతో నవ్వి పాయపుటాసలు దవ్వి చిడుముడి సిగ్గుతోడఁ జెమరించీని కడు నిన్నట్టె చూచి కాయము మాపై వేసీ వొడి వట్టి తియ్యవయ్య వొద్దికతో నీవు (॥తాలిమి॥) కలికి నీకాలు దొక్కి కమ్మటి నీకు మొక్కి వలవనిసిగ్గుతోడ వడఁ బడీని నెల వై శ్రీవెంకటేశ నిన్నుఁ గూడె తన్నుఁ దానె అలమి పైకొన వయ్య అప్పటివి నీవు English(||pallavi||) tālimi sakkana gāni tamaga mĕṁ tainām̐ gaddu mela māḍavayya sĕli mīm̐da mīm̐da nunnadi (||tālimi||) vanidi puvvulavesi valabu nībaim̐ būsi tanum̐ dānĕ siggubaḍi tala vaṁchīni manasu nībai bĕṭṭi mām̐ṭalu mādo nāḍī pĕnam̐gi piluvavayya perugŏni nīvu (||tālimi||) paḍam̐ti nīdo navvi pāyabuḍāsalu davvi siḍumuḍi siggudoḍam̐ jĕmariṁchīni kaḍu ninnaṭṭĕ sūsi kāyamu mābai vesī vŏḍi vaṭṭi tiyyavayya vŏddigado nīvu (||tālimi||) kaligi nīgālu dŏkki kammaḍi nīgu mŏkki valavanisiggudoḍa vaḍam̐ baḍīni nĕla vai śhrīvĕṁkaḍeśha ninnum̐ gūḍĕ tannum̐ dānĕ alami paigŏna vayya appaḍivi nīvu