Title (Indic)తాపంబుఁ గోపంబు తమకుఁ దామే వేఁగు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) తాపంబుఁ గోపంబు తమకుఁ దామే వేఁగు పైపైనే వగపు లోపలి కెల్లా వేఁగు (॥తాపం॥) చెలియ దురిమిన తురుము శిరసునకుఁ గడువేఁగు తలపోత శిరసు కరతలమునకు వేఁగు కొలఁది మీఱిన యూర్పు కుచయుగములకు వేఁగు బలువు కుచములు నాభిపయి కల్లవేఁగు (॥తాపం॥) మురిపంపు నడపు చెలిమొలనూలికిని వేఁగు బిరుసైన మొలనూలు పిరుఁదునకు వేఁగు అరిది జఘనము మందయానంబునకు వేఁగు తరుణి గమనము పాదతలమునకు వేఁగు (॥తాపం॥) మృగనేత్రిప్రాణంబు మేని కింతకు వేఁగు బుగులుకొను మైకాఁక పులకలకు వేఁగు తగు వేంకటేశు కృప ధైర్యంబునకు వేఁగు అగపడిన యీపొందు అలుకలకు వేఁగు English(||pallavi||) tābaṁbum̐ gobaṁbu tamagum̐ dāme vem̐gu paibaine vagabu lobali kĕllā vem̐gu (||tābaṁ||) sĕliya durimina turumu śhirasunagum̐ gaḍuvem̐gu talaboda śhirasu karadalamunagu vem̐gu kŏlam̐di mīṟina yūrbu kusayugamulagu vem̐gu baluvu kusamulu nābhibayi kallavem̐gu (||tābaṁ||) muribaṁpu naḍabu sĕlimŏlanūligini vem̐gu birusaina mŏlanūlu pirum̐dunagu vem̐gu aridi jaghanamu maṁdayānaṁbunagu vem̐gu taruṇi gamanamu pādadalamunagu vem̐gu (||tābaṁ||) mṛganetriprāṇaṁbu meni kiṁtagu vem̐gu bugulugŏnu maigām̐ka pulagalagu vem̐gu tagu veṁkaḍeśhu kṛpa dhairyaṁbunagu vem̐gu agabaḍina yībŏṁdu alugalagu vem̐gu