Title (Indic)చూతమే యీ సంతోసాలు సొరిదినుండి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చూతమే యీ సంతోసాలు సొరిదినుండి ఐతే నేమే సవతుల మది మనమేలే (॥॥) సతి తిట్టు లతనికి చవులై వుండఁగాను మతిలోన వగవఁగ మనకేల యితవై యీపెగుంపెన కితఁడు లోఁగుచుండఁగా కుతిలకుడువ నేలే కొమ్మలాల మనము (॥॥) ఆపె సేసే వుద్దండాలు ఆతఁడోరుచుకుండఁగా కోపమేలే మనకును కోపులనుండి వోపి యాలియాజ్ఞ మగఁడొట్టి జవదాటఁడు ఆపసోపాలేలే మన మందరిలో వారము (॥॥) కొంగాపె వట్టి తియ్యఁగాఁ గూచుండాతఁడు లోఁగాఁగా పంగించనేలే మనము పలుమారును యెంగిలి మోవిచ్చె నాపె యెనసి శ్రీవేంకటేశుఁ డంగదేలే యేలిరిద్దరట్టే మనములను English(||pallavi||) sūdame yī saṁtosālu sŏridinuṁḍi aide neme savadula madi manamele (||||) sadi tiṭṭu ladanigi savulai vuṁḍam̐gānu madilona vagavam̐ga managela yidavai yībĕguṁpĕna kidam̐ḍu lom̐gusuṁḍam̐gā kudilaguḍuva nele kŏmmalāla manamu (||||) ābĕ sese vuddaṁḍālu ādam̐ḍorusuguṁḍam̐gā kobamele managunu kobulanuṁḍi vobi yāliyājña magam̐ḍŏṭṭi javadāḍam̐ḍu ābasobālele mana maṁdarilo vāramu (||||) kŏṁgābĕ vaṭṭi tiyyam̐gām̐ gūsuṁḍādam̐ḍu lom̐gām̐gā paṁgiṁchanele manamu palumārunu yĕṁgili movichchĕ nābĕ yĕnasi śhrīveṁkaḍeśhum̐ ḍaṁgadele yeliriddaraṭṭe manamulanu