Title (Indic)చిత్తిణి యాపె సుద్దులు చెప్ప గొత్తలు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చిత్తిణి యాపె సుద్దులు చెప్ప గొత్తలు బత్తి నీపైఁ జేసీ నెంత పగటో తనకు (॥చిత్తి॥) మలసి మలసి చూచి మచ్చికతో నీకు లాచీ పొలఁతికి నీ కెన్నటి పొందోకాని చలియకు నీ దిక్కు చే సన్నలనే చూపీ లలి నెంతటిపని గలదో తనకు (॥చిత్తి॥) సిగ్గులు సోమున బెంచి సెలవులనవ్వు నించీ అగ్గమైన తారుకాణ లవి యెట్టివో దిగ్గనఁ గనుఁగొనల తేఁకువతో నీకు మొక్కీ వెగ్గళమై నీపై నెంత లే(వే?) సుకో తనకు (॥చిత్తి॥) యే నలమేల్మంగను నన్నేలితి శ్రీవేంకటేశ తానూఁ గొసరీ నిన్నెంత తగులాయెనో పానుపుపైఁ బండి నీకు పక్కన నెరుకసేసీ పూనిన యాస లెంత పొదలీనో తనకు English(||pallavi||) sittiṇi yābĕ suddulu sĕppa gŏttalu batti nībaim̐ jesī nĕṁta pagaḍo tanagu (||sitti||) malasi malasi sūsi machchigado nīgu lāsī pŏlam̐tigi nī kĕnnaḍi pŏṁdogāni saliyagu nī dikku se sannalane sūbī lali nĕṁtaḍibani galado tanagu (||sitti||) siggulu somuna bĕṁchi sĕlavulanavvu niṁchī aggamaina tārugāṇa lavi yĕṭṭivo digganam̐ ganum̐gŏnala tem̐kuvado nīgu mŏkkī vĕggaḽamai nībai nĕṁta le(ve?) sugo tanagu (||sitti||) ye nalamelmaṁganu nannelidi śhrīveṁkaḍeśha tānūm̐ gŏsarī ninnĕṁta tagulāyĕno pānububaim̐ baṁḍi nīgu pakkana nĕrugasesī pūnina yāsa lĕṁta pŏdalīno tanagu