Title (Indic)చెప్పి పంపవలెనటె చెలువుఁడు నా వొద్దికి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చెప్పి పంపవలెనటె చెలువుఁడు నా వొద్దికి వొప్పుగొంటి రమ్మనవే వొద్దనేనా తన్నును (॥చెప్పి॥) మనసులే కలసితే మరి యెడమాటలేల గొనకొన్న సంతోసానఁ గూడుటఁగాక చనవు వెగ్గళమైతే జగడాలు మరియేల ననిచి వేసటలేక నవ్వుట గాక (॥చెప్పి॥) కూరిములే కలిగితే గుణాలు వెదకనేల నేరుపు లొండొరులపై నించుటకాక కోరికె లేడేరితేను కొసరఁగ నిఁకనేల మేరతోడి చేఁతలకే మెచ్చుటగాక (॥చెప్పి॥) చేతికి లోనైతేను సిగ్గులు వడఁగ నేల కాతరాన రతులెల్లా గైకొంటగాక యీతల శ్రీ వేంకటేశుఁడిదె తానే నన్నుఁ గూడె కోతరపుఁ బ్రియములఁ బొసఁగుటగాక English(||pallavi||) sĕppi paṁpavalĕnaḍĕ sĕluvum̐ḍu nā vŏddigi vŏppugŏṁṭi rammanave vŏddanenā tannunu (||sĕppi||) manasule kalaside mari yĕḍamāḍalela gŏnagŏnna saṁtosānam̐ gūḍuḍam̐gāga sanavu vĕggaḽamaide jagaḍālu mariyela nanisi vesaḍalega navvuḍa gāga (||sĕppi||) kūrimule kaligide guṇālu vĕdaganela nerubu lŏṁḍŏrulabai niṁchuḍagāga korigĕ leḍeridenu kŏsaram̐ga nim̐kanela meradoḍi sem̐talage mĕchchuḍagāga (||sĕppi||) sedigi lonaidenu siggulu vaḍam̐ga nela kādarāna radulĕllā gaigŏṁṭagāga yīdala śhrī veṁkaḍeśhum̐ḍidĕ tāne nannum̐ gūḍĕ kodarabum̐ briyamulam̐ bŏsam̐guḍagāga