Title (Indic)చెప్పవే నీ సుద్దులు చెవులారా నేము వినేము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చెప్పవే నీ సుద్దులు చెవులారా నేము వినేము వుప్పతిల్లీఁ దమకము లుల్లములో మాకును (॥॥) వెన్నెలగాసీ మొగాన వేడుక నీనవ్వులనే సన్నలనే సంతోసాలు చాలామించీని చెన్ను మీర నీపతి నీచేతికి లోనాయనా పన్ని నేఁడు నీతపము పఁలియించెనా (॥॥) చెక్కులఁ జెమటగారీ సిగ్గులు కన్నులఁ దేరీ తక్కక నిండుఁగళలు దైవారీని చక్కనినీపతి నీకు చనవులెల్లా నిచ్చెనా మిక్కిలి నీవువేసిన మేలెల్లా నీడేరెనా (॥॥) మోవితేనె లుట్టిపడీ ముంచినతీపులతోడ భావించితే నీకు మేనఁ బచ్చిదేరీని నీవల మేలుమంగవు నెమ్మది శ్రీవేంకటేశుఁ - డీవేళ నిన్నుఁ గూడెనా యీడకు విచ్చేసెనా English(||pallavi||) sĕppave nī suddulu sĕvulārā nemu vinemu vuppadillīm̐ damagamu lullamulo māgunu (||||) vĕnnĕlagāsī mŏgāna veḍuga nīnavvulane sannalane saṁtosālu sālāmiṁchīni sĕnnu mīra nībadi nīsedigi lonāyanā panni nem̐ḍu nīdabamu pam̐liyiṁchĕnā (||||) sĕkkulam̐ jĕmaḍagārī siggulu kannulam̐ derī takkaga niṁḍum̐gaḽalu daivārīni sakkaninībadi nīgu sanavulĕllā nichchĕnā mikkili nīvuvesina melĕllā nīḍerĕnā (||||) movidenĕ luṭṭibaḍī muṁchinadībuladoḍa bhāviṁchide nīgu menam̐ bachchiderīni nīvala melumaṁgavu nĕmmadi śhrīveṁkaḍeśhum̐ - ḍīveḽa ninnum̐ gūḍĕnā yīḍagu vichchesĕnā