Title (Indic)చెప్పఁగల బుద్దులెల్లాఁ జెప్పితి నీకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చెప్పఁగల బుద్దులెల్లాఁ జెప్పితి నీకు నెప్పున నిట్లైతే మన్నించునే నీ విభుఁడు (॥చెప్ప॥) మంచిమాట లాడితేను మగఁడు మోహించునే వంచన గలిగితేను వసమైయుండునే ముంచి శావలు సేసితే మొగమోట గలుగునే మించి యీనేరుపుల మెలఁగవే చెలియ (॥చెప్ప॥) తనయిచ్చతో నుండితే దయతో రక్షించునే మనసెరిఁగి కూడితే మరిగుండునే వినయమే సేసితే వేడుకతో లాలించునే పెనఁగక యీగుణాల బెరయవే చెలియ (॥చెప్ప॥) నీవే పైకొంటేను నెమ్మది నిన్ను మెచ్చునే యేవేళఁ బాయకుండితే యింపు వుట్టునే శ్రీవేంకటేశుఁ డేలెఁ జిత్తము రా బ్రతుకవే వేవేల కలమేల్మంగ వెలయవే చెలియ English(||pallavi||) sĕppam̐gala buddulĕllām̐ jĕppidi nīgu nĕppuna niṭlaide manniṁchune nī vibhum̐ḍu (||sĕppa||) maṁchimāḍa lāḍidenu magam̐ḍu mohiṁchune vaṁchana galigidenu vasamaiyuṁḍune muṁchi śhāvalu seside mŏgamoḍa galugune miṁchi yīnerubula mĕlam̐gave sĕliya (||sĕppa||) tanayichchado nuṁḍide dayado rakṣhiṁchune manasĕrim̐gi kūḍide mariguṁḍune vinayame seside veḍugado lāliṁchune pĕnam̐gaga yīguṇāla bĕrayave sĕliya (||sĕppa||) nīve paigŏṁṭenu nĕmmadi ninnu mĕchchune yeveḽam̐ bāyaguṁḍide yiṁpu vuṭṭune śhrīveṁkaḍeśhum̐ ḍelĕm̐ jittamu rā bradugave vevela kalamelmaṁga vĕlayave sĕliya