Title (Indic)చెలులాల వీూ లేల చెలువుని దూరేరే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చెలులాల వీూ లేల చెలువుని దూరేరే తలఁపులో నతనికి దయవుట్టీఁ గాకా (॥చెలులాల॥) మనసురానిపని మాపుదాఁకాఁ జెప్పినాను వినేటిటోలే కాని వేడుక లేదు యెనయని చుట్టరిక మెటువలేఁ బొడిగినా పెనగులాటే కాని ప్రియ మొనకూడదు (॥చెలులాల॥) పలిసి నొల్లని యట్టి వలపు లొడిగట్టిఁ గట్టితే బలవంతకోలె కాని పాదుకొనదు చలపట్టినచో నెంత సారె గిలిగించినాను ఆలయికే కాని యించుకంత నవ్వురాదు (॥చెలులాల॥) తమిలేని కౌఁగిలి తా నెంత బిగించినాను చెమటలే నిండు గాని సెలవు గాదు అనుర శ్రీవేంకటేశుఁ డంతలోనే నన్ను గూడె సమరతులౌఁగాని చవి దప్పదింకను English(||pallavi||) sĕlulāla vīూ lela sĕluvuni dūrere talam̐pulo nadanigi dayavuṭṭīm̐ gāgā (||sĕlulāla||) manasurānibani mābudām̐kām̐ jĕppinānu vineḍiḍole kāni veḍuga ledu yĕnayani suṭṭariga mĕḍuvalem̐ bŏḍiginā pĕnagulāḍe kāni priya mŏnagūḍadu (||sĕlulāla||) palisi nŏllani yaṭṭi valabu lŏḍigaṭṭim̐ gaṭṭide balavaṁtagolĕ kāni pādugŏnadu salabaṭṭinaso nĕṁta sārĕ giligiṁchinānu ālayige kāni yiṁchugaṁta navvurādu (||sĕlulāla||) tamileni kaum̐gili tā nĕṁta bigiṁchinānu sĕmaḍale niṁḍu gāni sĕlavu gādu anura śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalone nannu gūḍĕ samaradulaum̐gāni savi dappadiṁkanu