Title (Indic)చెల్లు నీకునిఁక నీచేతఁ జిక్కె వలపు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చెల్లు నీకునిఁక నీచేతఁ జిక్కె వలపు యెల్లవారమును నిన్ను యిఁక దూరేమా (॥చెల్లు॥) చేసిన చేఁతల కెల్ల శికర మెత్తిన యట్టు యీసతి వంచిన శిరసెత్తెఁగా నీకు వేసారని సిగ్గులగు వెరసి వెట్టినయట్టు మూసిన మోవి పై నాపె ముద్రవెట్టెఁగా (॥చెల్లు॥) సంగడి కోరికలకు సఫలమైనయట్టు వుంగిటిఁ గుచాల నాపె వొత్తెఁగా నిన్ను కంగులేని నీ గుణాలు కవిలెల వ్రాసినట్టు అంగమెల్ల గోర గీరి అంటెఁగా నిన్ను (॥చెల్లు॥) కూడిన కూటములెల్ల కోటికొండలైనట్టు నీడలుగాఁ బులకలు నించెఁగా ఆపె యీడనె మావాఁడవైతివిప్పుడె శ్రీ వెంకటేశ వోడఁగట్టిన దూలమై వొద్దనాపె వుండెఁగా English(||pallavi||) sĕllu nīgunim̐ka nīsedam̐ jikkĕ valabu yĕllavāramunu ninnu yim̐ka dūremā (||sĕllu||) sesina sem̐tala kĕlla śhigara mĕttina yaṭṭu yīsadi vaṁchina śhirasĕttĕm̐gā nīgu vesārani siggulagu vĕrasi vĕṭṭinayaṭṭu mūsina movi pai nābĕ mudravĕṭṭĕm̐gā (||sĕllu||) saṁgaḍi korigalagu saphalamainayaṭṭu vuṁgiḍim̐ gusāla nābĕ vŏttĕm̐gā ninnu kaṁguleni nī guṇālu kavilĕla vrāsinaṭṭu aṁgamĕlla gora gīri aṁṭĕm̐gā ninnu (||sĕllu||) kūḍina kūḍamulĕlla koḍigŏṁḍalainaṭṭu nīḍalugām̐ bulagalu niṁchĕm̐gā ābĕ yīḍanĕ māvām̐ḍavaidivippuḍĕ śhrī vĕṁkaḍeśha voḍam̐gaṭṭina dūlamai vŏddanābĕ vuṁḍĕm̐gā