Title (Indic)చేకొని వూడిగాలెల్లాఁ జేయించుకొనవయ్యా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చేకొని వూడిగాలెల్లాఁ జేయించుకొనవయ్యా యీ కడఁ గొలువవచ్చె నిదివో నిన్నును (॥చేకొ॥) పంతగాండవై వొంటి నీపానుపుపై నుండఁగాను మంతనమాడవచ్చెను మగువ చెంతల నీ మేనెల్లాఁ జెమరించియుండఁగాను ఇంతలో విసరవచ్చె నిదివో నీకును (॥చేకొ॥) గరిమతో సంతోసానఁ గడుమించి నీవుండఁగా సరసములాడవచ్చె సకియ తరుణలపైఁ గాంక్ష తలపోయుచుండఁగాను అరుదుగా నిన్ను బెండ్లాడవచ్చె నిపుడు (॥చేకొ॥) ఆదిగొని నిద్రలేచి ఆనందాన నుండఁగాను పాదము లొత్తఁగ వచ్చెఁ బడఁతి యీదెస శ్రీవేంకటేశ ఇంతి నిట్టె కూడితివి మోధముతోడుత నీకు మొక్కవచ్చెఁగూర్మిని English(||pallavi||) segŏni vūḍigālĕllām̐ jeyiṁchugŏnavayyā yī kaḍam̐ gŏluvavachchĕ nidivo ninnunu (||segŏ||) paṁtagāṁḍavai vŏṁṭi nībānububai nuṁḍam̐gānu maṁtanamāḍavachchĕnu maguva sĕṁtala nī menĕllām̐ jĕmariṁchiyuṁḍam̐gānu iṁtalo visaravachchĕ nidivo nīgunu (||segŏ||) garimado saṁtosānam̐ gaḍumiṁchi nīvuṁḍam̐gā sarasamulāḍavachchĕ sagiya taruṇalabaim̐ gāṁkṣha talaboyusuṁḍam̐gānu arudugā ninnu bĕṁḍlāḍavachchĕ nibuḍu (||segŏ||) ādigŏni nidralesi ānaṁdāna nuṁḍam̐gānu pādamu lŏttam̐ga vachchĕm̐ baḍam̐ti yīdĕsa śhrīveṁkaḍeśha iṁti niṭṭĕ kūḍidivi modhamudoḍuda nīgu mŏkkavachchĕm̐gūrmini