Title (Indic)చద్దికి వేఁడికి మీరు సరసములాడరాదా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చద్దికి వేఁడికి మీరు సరసములాడరాదా యిద్దరుఁ గూడితిరి మీకిఁకనేల అలుక (॥చద్ది॥) మచ్చరపు గొణఁగులు మాఁటలాడినందాఁకానే అచ్చలము మోము చూచినందాఁకనే తచ్చనలన్నియు నేకాంతములైనందాఁకానే యెచ్చుకొందు లేదు మీకు యిఁకనేల అలుక (॥చద్ది॥) మునుకొన్నజగడము మొక్కు మొక్కినందాఁకానే అనుగుమోనము నవ్వినందాఁకానే పెనఁగులాటలు తమిపెరరేఁచినందాఁకానే యెనసెఁ జుట్టురికములిఁకనేలె అలుక (॥చద్ది॥) నేసవెట్టిన సిగ్గులు చేయి మోఁచినందాఁకానే ఆసలెల్లాఁ గాఁగిలించినందాఁకానే వాసితో శ్రీ వెంకటేశ్వర కూడితిరి మీరు యీసులెల్లాఁ బెడఁబాసెనిఁకనేఁటియలుక English(||pallavi||) saddigi vem̐ḍigi mīru sarasamulāḍarādā yiddarum̐ gūḍidiri mīgim̐kanela aluga (||saddi||) machcharabu gŏṇam̐gulu mām̐ṭalāḍinaṁdām̐kāne achchalamu momu sūsinaṁdām̐kane tachchanalanniyu negāṁtamulainaṁdām̐kāne yĕchchugŏṁdu ledu mīgu yim̐kanela aluga (||saddi||) munugŏnnajagaḍamu mŏkku mŏkkinaṁdām̐kāne anugumonamu navvinaṁdām̐kāne pĕnam̐gulāḍalu tamibĕrarem̐sinaṁdām̐kāne yĕnasĕm̐ juṭṭurigamulim̐kanelĕ aluga (||saddi||) nesavĕṭṭina siggulu seyi mom̐sinaṁdām̐kāne āsalĕllām̐ gām̐giliṁchinaṁdām̐kāne vāsido śhrī vĕṁkaḍeśhvara kūḍidiri mīru yīsulĕllām̐ bĕḍam̐bāsĕnim̐kanem̐ṭiyaluga