Title (Indic)చానిపి లోపలఁ జవిగలదా । యివి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చానిపి లోపలఁ జవిగలదా । యివి మానిపి నీ గతి మరపుదుఁ గాకా (॥చాని॥) చంచలపు గుణముల జడిసిన జీవుఁడు మంచి గుణంబుల మలసీనా అంచెల హరి నీ వంతర్యామివి నించి నీ గుణమే నెరవుదుఁ గాకా (॥చాని॥) బూతుల యెంగిలిఁ బుట్టిన దేహము బాఁతిగ శుచియై పరగీనా చైతన్య మందులో శ్రీపతివి నీవు నీ తత్త్వ ఫలమే నెరపుదుఁ గాకా (॥చాని॥) లలి సుఖదుఃఖపు లంకె కాఁపురము మెలుపున సాజాన మెలఁగీనా యిలపై శ్రీవేంకటేశ్వర నీవిది కలిగించితి విఁకఁ గాతువుఁ గాకా English(||pallavi||) sānibi lobalam̐ javigaladā | yivi mānibi nī gadi marabudum̐ gāgā (||sāni||) saṁchalabu guṇamula jaḍisina jīvum̐ḍu maṁchi guṇaṁbula malasīnā aṁchĕla hari nī vaṁtaryāmivi niṁchi nī guṇame nĕravudum̐ gāgā (||sāni||) būdula yĕṁgilim̐ buṭṭina dehamu bām̐tiga śhusiyai paragīnā saidanya maṁdulo śhrībadivi nīvu nī tattva phalame nĕrabudum̐ gāgā (||sāni||) lali sukhaduḥkhabu laṁkĕ kām̐puramu mĕlubuna sājāna mĕlam̐gīnā yilabai śhrīveṁkaḍeśhvara nīvidi kaligiṁchidi vim̐kam̐ gāduvum̐ gāgā