Title (Indic)సామాన్యమా వలపు సతులుఁ బతులనుభవన(ము) WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) సామాన్యమా వలపు సతులుఁ బతులనుభవన(ము)- లేమరినఁ బ్రాణంబు లేరీతినుండు (॥సామా॥) కలికి చూపుల మనసు గరఁగ కెటువలె నుండు అలయింతలను దేహమలయకేలుండు బులుపుఁ బిలుపుల మేను పులకించకేలుండు మొలకనగవుల యాస మొలవకేలుండు (॥సామా॥) పచ్చిచూపులు కాఁడి పారకెటువలెనుండు వెచ్చనూర్పులు మనసు వేఁచకేలుండు మచ్చికల హృదయంబు మరులు గొనకేలుండు అచ్చలంబునఁ గాఁకలలమకేలుండు (॥సామా॥) దంటమాటలఁ గూర్మి దగుల కెటువలెనుండు నంటునను మోహంబు నాఁటకేలుండు గొంటుఁజేఁతల మనసు కొల్లగొనకేలుండు రెంటలను విరహగ్ని రేఁచకేలుండు (॥సామా॥) కింకలను దమకంబు కెరలకెటువలె నుండు జంకెనలఁ బ్రేమ కొనసాఁగకేలుండు వేంకటవిభుఁనిఁ గలసి వెడయలుక యేలుండు పంకజానన వానిఁ బాసియేలుండు English(||pallavi||) sāmānyamā valabu sadulum̐ badulanubhavana(mu)- lemarinam̐ brāṇaṁbu lerīdinuṁḍu (||sāmā||) kaligi sūbula manasu garam̐ga kĕḍuvalĕ nuṁḍu alayiṁtalanu dehamalayageluṁḍu bulubum̐ bilubula menu pulagiṁchageluṁḍu mŏlaganagavula yāsa mŏlavageluṁḍu (||sāmā||) pachchisūbulu kām̐ḍi pāragĕḍuvalĕnuṁḍu vĕchchanūrbulu manasu vem̐sageluṁḍu machchigala hṛdayaṁbu marulu gŏnageluṁḍu achchalaṁbunam̐ gām̐kalalamageluṁḍu (||sāmā||) daṁṭamāḍalam̐ gūrmi dagula kĕḍuvalĕnuṁḍu naṁṭunanu mohaṁbu nām̐ṭageluṁḍu gŏṁṭum̐jem̐tala manasu kŏllagŏnageluṁḍu rĕṁṭalanu virahagni rem̐sageluṁḍu (||sāmā||) kiṁkalanu damagaṁbu kĕralagĕḍuvalĕ nuṁḍu jaṁkĕnalam̐ brema kŏnasām̐gageluṁḍu veṁkaḍavibhum̐nim̐ galasi vĕḍayaluga yeluṁḍu paṁkajānana vānim̐ bāsiyeluṁḍu