Title (Indic)చాలునిది పదివేలు సరివచ్చెఁగా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలునిది పదివేలు సరివచ్చెఁగా తాలిమిఁ జెలులమాఁటే తప్పదాయఁగా (॥చాలు॥) అదె నామతి పలచనైనా నాయఁగాని కదిసితే నీనవ్వు గట్టియాయఁగా అదన నాచూపు తెల్లనైనా నాయఁగాని యెదుట నీమోవి యిదె యెఱ్ఱనాయఁగా (॥చాలు॥) కడగిననామేను కాఁకైనా నాయఁగాని చిడుముడి నీచెక్కు చెమరించెఁగా నడుమనే వేగించినా వేగించితిగాక తొడరి నీకైతే నిద్ర తొట్టుకొనెఁగా (॥చాలు॥) రేఁగుచు నాగోరఁ జిన్న రేకయైనా నాయఁగాని కాఁగిటినీయాసలైతేఁ గనమాయఁగా చేగఁదేరెను రతుల శ్రీవేంకటేశ నేఁడు తోఁగినమనరతులు తులఁదూఁగెఁగా English(||pallavi||) sālunidi padivelu sarivachchĕm̐gā tālimim̐ jĕlulamām̐ṭe tappadāyam̐gā (||sālu||) adĕ nāmadi palasanainā nāyam̐gāni kadiside nīnavvu gaṭṭiyāyam̐gā adana nāsūbu tĕllanainā nāyam̐gāni yĕduḍa nīmovi yidĕ yĕṭranāyam̐gā (||sālu||) kaḍaginanāmenu kām̐kainā nāyam̐gāni siḍumuḍi nīsĕkku sĕmariṁchĕm̐gā naḍumane vegiṁchinā vegiṁchidigāga tŏḍari nīgaide nidra tŏṭṭugŏnĕm̐gā (||sālu||) rem̐gusu nāgoram̐ jinna regayainā nāyam̐gāni kām̐giḍinīyāsalaidem̐ ganamāyam̐gā segam̐derĕnu radula śhrīveṁkaḍeśha nem̐ḍu tom̐ginamanaradulu tulam̐dūm̐gĕm̐gā