Title (Indic)చాలుఁజాలు నిఁకనేల సాదింపులు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలుఁజాలు నిఁకనేల సాదింపులు మీలోనిదాన నేను మీరే నేను (॥చాలు॥) కతలు నేరుచుఁ దాను కపటా లెరుఁగుఁ దాను అతనితో నే మాటలాడఁగలనా ఇతవరులైనవారు ఇచ్చకాలాడరే మీరు మితిమీరితేఁజాలు మీరే నేను (॥చాలు॥) తప్పులు లేవు దనకు తగవ రిన్నిటాఁ దాను దెప్పరమై తనతోను దీకొనేనా చెప్పరానిచుట్టాలు సేవలు సేయరే మీరు మెప్పించితేఁ జాలు మీరే నేను (॥చాలు॥) అన్నిటా జాణఁడు దాను అందాలకు వచ్చుఁ దాను చన్నుల నొత్తితి నిఁక చలపట్టేనా వున్నతి శ్రీవేంకటేశు నొనగూర్చితిరి మీరు మిన్నక నవ్వఁగఁ దేరె మీరే నేను English(||pallavi||) sālum̐jālu nim̐kanela sādiṁpulu mīlonidāna nenu mīre nenu (||sālu||) kadalu nerusum̐ dānu kabaḍā lĕrum̐gum̐ dānu adanido ne māḍalāḍam̐galanā idavarulainavāru ichchagālāḍare mīru midimīridem̐jālu mīre nenu (||sālu||) tappulu levu danagu tagava rinniḍām̐ dānu dĕpparamai tanadonu dīgŏnenā sĕpparānisuṭṭālu sevalu seyare mīru mĕppiṁchidem̐ jālu mīre nenu (||sālu||) anniḍā jāṇam̐ḍu dānu aṁdālagu vachchum̐ dānu sannula nŏttidi nim̐ka salabaṭṭenā vunnadi śhrīveṁkaḍeśhu nŏnagūrsidiri mīru minnaga navvam̐gam̐ derĕ mīre nenu