Title (Indic)చాలుఁజాలు నిఁకనేల జాలిఁబెట్టేవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలుఁజాలు నిఁకనేల జాలిఁబెట్టేవు యేలాటాలు యేనుగతో నింత నేరఁగలమా (॥చాలు॥) తగవులే నడపేవు తరుకాణకే వచ్చేవు జగడము సాదించితే సారె నవ్వేవు మొగము చూచితేను ముంచి యానలు వెట్టేవు యెగసక్కీఁడవు నీతో నింత నేరఁగలమా (॥చాలు॥) తేరకొనఁ జూచేవు తేనె లుట్టిపడించేవు తారుచుఁ దిట్టితే జాణతనాలాడేవు మారుమోమై వుండితేను మరియు వేఁడుకొనేవు యీరీతివాఁవు నీతో నిఁత నేరఁగలమా (॥చాలు॥) కందువలే చూపేవు కాఁగిటనె కూడేవు అంది వెంగెమాడితేను అట్టె మెచ్చేవు ఇందరిలో శ్రీవేంకటేశుఁడ నన్నేలతివి యిందలివాఁడవు నీతో నింత నేరఁగలమా English(||pallavi||) sālum̐jālu nim̐kanela jālim̐bĕṭṭevu yelāḍālu yenugado niṁta neram̐galamā (||sālu||) tagavule naḍabevu tarugāṇage vachchevu jagaḍamu sādiṁchide sārĕ navvevu mŏgamu sūsidenu muṁchi yānalu vĕṭṭevu yĕgasakkīm̐ḍavu nīdo niṁta neram̐galamā (||sālu||) teragŏnam̐ jūsevu tenĕ luṭṭibaḍiṁchevu tārusum̐ diṭṭide jāṇadanālāḍevu mārumomai vuṁḍidenu mariyu vem̐ḍugŏnevu yīrīdivām̐vu nīdo nim̐ta neram̐galamā (||sālu||) kaṁduvale sūbevu kām̐giḍanĕ kūḍevu aṁdi vĕṁgĕmāḍidenu aṭṭĕ mĕchchevu iṁdarilo śhrīveṁkaḍeśhum̐ḍa nanneladivi yiṁdalivām̐ḍavu nīdo niṁta neram̐galamā