Title (Indic)చాలుఁజాలు నీ హరియే మాకును సకలక్రియలకు నాయకుఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలుఁజాలు నీ హరియే మాకును సకలక్రియలకు నాయకుఁడు నాలుక తుదనే యీతఁడుండఁగా నలుగడ నెవ్వరి వెదకేము (॥చాలుఁ॥) యేలినవాఁడట లక్ష్మీవిభుఁడట యేమిటనుఁ గొరత మాకిఁకను నాలోనున్నాఁడు బ్రహ్మతండ్రియట నాకాయుష్యము బాఁతా పాలజలధిపై దేవుని వారము పాఁడి మాకు నిఁక నేమరుదు ఆలింపఁగ నేమింతటివారము అన్యులకిఁకఁ జేయి చాఁచేమా (॥చాలుఁ॥) భూకాంతాపతి కింకరులము యీ భూము లిన్నియును మాసొమ్మే పైకొని చక్రాయుధుఁడే మాదాపు భయము లిన్నిటాఁ బాసితిమి యీకడ నచ్యుతుమరఁగు చొచ్చితిమి యెన్నటికిని నాశములేదు యేకొఱఁతని ఇఁక నాసపడుచు నేమెవ్వరికి నోళ్లు దెరచెదము (॥చాలుఁ॥) శ్రీవైకుంఠుని దాసులమట యరచేతిది మోక్షము మా కిదివో పావనగంగాజనకుని బంట్లము పాపములన్నిటఁ బాసితిమి శ్రీవేంకటపతి వరములియ్యఁగా జిక్కిన వెలుతులు మాకేవి యీ వైభవములఁ దనిసిన మాకును ఇతరులఁ దగిలెడిదిఁక నేది English(||pallavi||) sālum̐jālu nī hariye māgunu sagalakriyalagu nāyagum̐ḍu nāluga tudane yīdam̐ḍuṁḍam̐gā nalugaḍa nĕvvari vĕdagemu (||sālum̐||) yelinavām̐ḍaḍa lakṣhmīvibhum̐ḍaḍa yemiḍanum̐ gŏrada māgim̐kanu nālonunnām̐ḍu brahmadaṁḍriyaḍa nāgāyuṣhyamu bām̐tā pālajaladhibai devuni vāramu pām̐ḍi māgu nim̐ka nemarudu āliṁpam̐ga nemiṁtaḍivāramu anyulagim̐kam̐ jeyi sām̐semā (||sālum̐||) bhūgāṁtābadi kiṁkarulamu yī bhūmu linniyunu māsŏmme paigŏni sakrāyudhum̐ḍe mādābu bhayamu linniḍām̐ bāsidimi yīgaḍa nachyudumaram̐gu sŏchchidimi yĕnnaḍigini nāśhamuledu yegŏṟam̐tani im̐ka nāsabaḍusu nemĕvvarigi noḽlu dĕrasĕdamu (||sālum̐||) śhrīvaiguṁṭhuni dāsulamaḍa yarasedidi mokṣhamu mā kidivo pāvanagaṁgājanaguni baṁṭlamu pābamulanniḍam̐ bāsidimi śhrīveṁkaḍabadi varamuliyyam̐gā jikkina vĕludulu māgevi yī vaibhavamulam̐ danisina māgunu idarulam̐ dagilĕḍidim̐ka nedi