Title (Indic)చాలుఁజాలు ననరె సాదించ మమ్మింతయేల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలుఁజాలు ననరె సాదించ మమ్మింతయేల యీలకూర కుప్పు చాల దిందేమి గలదే (॥చాలు॥) గొప్పలు మాకన్నులు కొంచము మానెమ్మొగము తపపులెన్నైనాఁ గలవు తడవనేలే చిప్పిలీ నాకిదె నవ్వు చిందీ నామోవిఁ దేనె యెప్పుడు వచ్చినాఁ దన కిందేమి గలదే (॥చాలు॥) పిడికెఁడు మానడుము పెచ్చువెరిగేచన్నులు వెడ మామేనివొచ్చాలు వెదకనేలే వుడికీ నామనసైతే వూరికె యదరీ మేను యెడయక తాఁ బిలిచీ నిందేమి గలదే (॥చాలు॥) కంచువంటిది కుత్తిక కపురాలు పలుకులు యెంచి మామాటలు సోదించఁగనేలే అంచెల శ్రీవేంకటేశుఁ డాదరించి నన్నుఁ గూడె యెంచియెంచి పొగడీని యిందేమి గలదె English(||pallavi||) sālum̐jālu nanarĕ sādiṁcha mammiṁtayela yīlagūra kuppu sāla diṁdemi galade (||sālu||) gŏppalu māgannulu kŏṁchamu mānĕmmŏgamu tababulĕnnainām̐ galavu taḍavanele sippilī nāgidĕ navvu siṁdī nāmovim̐ denĕ yĕppuḍu vachchinām̐ dana kiṁdemi galade (||sālu||) piḍigĕm̐ḍu mānaḍumu pĕchchuvĕrigesannulu vĕḍa māmenivŏchchālu vĕdaganele vuḍigī nāmanasaide vūrigĕ yadarī menu yĕḍayaga tām̐ bilisī niṁdemi galade (||sālu||) kaṁchuvaṁṭidi kuttiga kaburālu palugulu yĕṁchi māmāḍalu sodiṁcham̐ganele aṁchĕla śhrīveṁkaḍeśhum̐ ḍādariṁchi nannum̐ gūḍĕ yĕṁchiyĕṁchi pŏgaḍīni yiṁdemi galadĕ