Title (Indic)చాలుఁబో యీ పొందే చవులు నీకును WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలుఁబో యీ పొందే చవులు నీకును ఆలించి యేమి సేసినా ఆయము సోఁకీని (॥చాలు॥) అచ్చపు గుట్టున నుండవయ్య నీవు । నీతో హెచ్చి నిజమాడరాదు యీకాలము ఇచ్చకము లాడువారే ఇతవు నీకు । నిన్నుఁ బచ్చిగా నేమన్నాను పసురువేసీని (॥చాలు॥) అంటిముట్టి సరసా లేలయ్యా నీవు యింటిచెట్టు మందు గాదు యీకాలము వెంటఁదిరుగాడువారే వేడుక నీకు । నిన్ను దంటనై నేనేమన్నాఁదగవు దప్పీని (॥చాలు॥) అలయించేవు రతి నేలయ్యా నీవు యెలమిఁ గాఁగిలే చాలు నీ కాలము బలిమి శ్రీవేంకటేశ పట్టి గూడితిని నన్ను తొలఁగి నిన్నేమన్నాను దోసము వచ్చీని English(||pallavi||) sālum̐bo yī pŏṁde savulu nīgunu āliṁchi yemi sesinā āyamu som̐kīni (||sālu||) achchabu guṭṭuna nuṁḍavayya nīvu | nīdo hĕchchi nijamāḍarādu yīgālamu ichchagamu lāḍuvāre idavu nīgu | ninnum̐ bachchigā nemannānu pasuruvesīni (||sālu||) aṁṭimuṭṭi sarasā lelayyā nīvu yiṁṭisĕṭṭu maṁdu gādu yīgālamu vĕṁṭam̐dirugāḍuvāre veḍuga nīgu | ninnu daṁṭanai nenemannām̐dagavu dappīni (||sālu||) alayiṁchevu radi nelayyā nīvu yĕlamim̐ gām̐gile sālu nī kālamu balimi śhrīveṁkaḍeśha paṭṭi gūḍidini nannu tŏlam̐gi ninnemannānu dosamu vachchīni