Title (Indic)చాలుఁ జాలును భోగమయమున మైమఱపు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలుఁ జాలును భోగమయమున మైమఱపు- పాలుపడునట యేఁటి బ్రదుకురా వోరి (॥చాలు॥) ఇందుమఖి నిను గౌఁగిలించి లోపలి జగము కందునని నీ బిగువుఁ గౌఁగిలే వదలె పొందైన వారితోఁ బొసఁగఁ గౌఁగిఁట జేర్పఁ బొందుగాదట యేఁటి పొందురా వోరి (॥చాలు॥) నెలఁత నీ వాలుఁగన్నులు మూసి జగమెల్లఁ గలయఁ జీఁకట్లైన గక్కనను వదలె వలచినంగనలు తమ వలసిన విలాసముల- వలను నెరపని దేఁటి వలపురా వోరి (॥చాలు॥) కొమ్మ నీవురముపై గోరు దివియుచు నాత్మ- నిమ్మైన ననుఁదాక నిద్దరిని దాఁకె దిమ్మరివి కోనేటితిమ్మ నీపైఁ బ్రియము కుమ్మరించని దేఁటి కోర్కిరా వోరి English(||pallavi||) sālum̐ jālunu bhogamayamuna maimaṟabu- pālubaḍunaḍa yem̐ṭi bradugurā vori (||sālu||) iṁdumakhi ninu gaum̐giliṁchi lobali jagamu kaṁdunani nī biguvum̐ gaum̐gile vadalĕ pŏṁdaina vāridom̐ bŏsam̐gam̐ gaum̐gim̐ṭa jerbam̐ bŏṁdugādaḍa yem̐ṭi pŏṁdurā vori (||sālu||) nĕlam̐ta nī vālum̐gannulu mūsi jagamĕllam̐ galayam̐ jīm̐kaṭlaina gakkananu vadalĕ valasinaṁganalu tama valasina vilāsamula- valanu nĕrabani dem̐ṭi valaburā vori (||sālu||) kŏmma nīvuramubai goru diviyusu nātma- nimmaina nanum̐dāga niddarini dām̐kĕ dimmarivi koneḍidimma nībaim̐ briyamu kummariṁchani dem̐ṭi korgirā vori