Title (Indic)చాలుఁ జాలుఁ దనిసితి సటలనె నేఁ డెల్ల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలుఁ జాలుఁ దనిసితి సటలనె నేఁ డెల్ల తాలిమి నిందుకె నిన్నుఁ దప్పక చూచేను (॥చాలు॥) నేయ రానిచేఁత లెల్లఁ జేసి వచ్చి నీవు నన్ను పాయిని చుట్టమువలెఁ బై కొనేవు కాయకపువారికె కాని లే వీ వినయాలు వొయమ్మ నిన్నే మనే నూరకుండేఁ గాక (॥చాలు॥) చిత్త మెక్కడనో పెట్టి చేరి నాతో మాయలకు బిత్త గలవానివెల పలికే విదే హత్తి గాయగంట్లె కాని అంతేసి నేరరు యిత్తల నెట్టు పూఁకొందు నిట్టె నవ్వేఁ గాక (॥చాలు॥) తేరకల్లె నెవ్వతెనో తెచ్చి యాపెచేత నాకు చేరికొనఁ బెట్టి సేవ సేయించేవు నేరుపు శ్రీవెంకటేశ నీకె కాని లేదు సారెనన్నుఁ గూడితివి సమ్మతాయ నిదివో English(||pallavi||) sālum̐ jālum̐ danisidi saḍalanĕ nem̐ ḍĕlla tālimi niṁdugĕ ninnum̐ dappaga sūsenu (||sālu||) neya rānisem̐ta lĕllam̐ jesi vachchi nīvu nannu pāyini suṭṭamuvalĕm̐ bai kŏnevu kāyagabuvārigĕ kāni le vī vinayālu vŏyamma ninne mane nūraguṁḍem̐ gāga (||sālu||) sitta mĕkkaḍano pĕṭṭi seri nādo māyalagu bitta galavānivĕla palige vide hatti gāyagaṁṭlĕ kāni aṁtesi neraru yittala nĕṭṭu pūm̐kŏṁdu niṭṭĕ navvem̐ gāga (||sālu||) teragallĕ nĕvvadĕno tĕchchi yābĕseda nāgu serigŏnam̐ bĕṭṭi seva seyiṁchevu nerubu śhrīvĕṁkaḍeśha nīgĕ kāni ledu sārĕnannum̐ gūḍidivi sammadāya nidivo