Title (Indic)చాలుఁ జాలు వాఁడులేని జన్మమేలా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలుఁ జాలు వాఁడులేని జన్మమేలా జాలి నన్నుఁ బెట్టకురె సారె సారెఁ జెలులు (॥చాలు॥) నేఁడు వానిఁబాసిన వెన్నెలబయలేలా వోడక వాఁడుగాఁగిటనుండనినిద్రేలా కూడి వాఁడు నేను గప్పుకోనిపయ్యెదేలా వీడని చెక్కుతోడివెరగే చాలును (॥చాలు॥) లీల వానిసరసములేనినవ్వేలా ఆలించి వాడువినని ఆమాటలేలా సోలి నిద్దరు నొక్కటై చూడనియద్దమేలా తాలిమితో లోలోనె తలపోఁతే చాలును (॥చాలు॥) యీకడ వాఁడుగూడ నియీజవ్వనమేలా ఆకు వాఁడు మడచియియ్యనితమ్ములమేలా వాఁకగా శ్రీవేంకటాద్రి వాఁడు నన్నుఁ గూడె నిదె మాఁకు పడఁజొక్కినయీమర పిదె చాలును English(||pallavi||) sālum̐ jālu vām̐ḍuleni janmamelā jāli nannum̐ bĕṭṭagurĕ sārĕ sārĕm̐ jĕlulu (||sālu||) nem̐ḍu vānim̐bāsina vĕnnĕlabayalelā voḍaga vām̐ḍugām̐giḍanuṁḍaninidrelā kūḍi vām̐ḍu nenu gappugonibayyĕdelā vīḍani sĕkkudoḍivĕrage sālunu (||sālu||) līla vānisarasamuleninavvelā āliṁchi vāḍuvinani āmāḍalelā soli niddaru nŏkkaḍai sūḍaniyaddamelā tālimido lolonĕ talabom̐te sālunu (||sālu||) yīgaḍa vām̐ḍugūḍa niyījavvanamelā āgu vām̐ḍu maḍasiyiyyanidammulamelā vām̐kagā śhrīveṁkaḍādri vām̐ḍu nannum̐ gūḍĕ nidĕ mām̐ku paḍam̐jŏkkinayīmara pidĕ sālunu