Title (Indic)చాలుఁ జాలు నూరకుండు సతులెల్లా నవ్వేరు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలుఁ జాలు నూరకుండు సతులెల్లా నవ్వేరు కేలు చాఁచి తిట్టేటి పేలరీఁడు గలఁడా (॥చాలు॥) యెగసక్కేలకుఁ జెలు లేమైనా నాడుదురు పగటునబీరములు పచరింతురు పొగరున, నీ వందుకు బుజ్జగించవలెఁగాక మగువతోఁ గోపగించేమగవాఁడు గలఁడా (॥చాలు॥) కామించి రమణులు కడుసేఁతలు సేతురు ప్రేమమున పంతములు బెరయింతురు వేమరు నిట్లఇతే వేఁడుకొనవలెఁగాక రామలతోనలిగేటి రమణుఁడు గలఁడా (॥చాలు॥) అలవోకగానెలఁత లన్నిటాను నవ్వుదురు బలిమి శ్రీవేంకటేశపై కొందురు కలిసితి విటువలెఁగరుణించవలెఁగాక చెలులతో నెగ్గులెంచేచెలువుడుగలఁడా English(||pallavi||) sālum̐ jālu nūraguṁḍu sadulĕllā navveru kelu sām̐si tiṭṭeḍi pelarīm̐ḍu galam̐ḍā (||sālu||) yĕgasakkelagum̐ jĕlu lemainā nāḍuduru pagaḍunabīramulu pasariṁturu pŏgaruna, nī vaṁdugu bujjagiṁchavalĕm̐gāga maguvadom̐ gobagiṁchemagavām̐ḍu galam̐ḍā (||sālu||) kāmiṁchi ramaṇulu kaḍusem̐talu seduru premamuna paṁtamulu bĕrayiṁturu vemaru niṭla̮ide vem̐ḍugŏnavalĕm̐gāga rāmaladonaligeḍi ramaṇum̐ḍu galam̐ḍā (||sālu||) alavogagānĕlam̐ta lanniḍānu navvuduru balimi śhrīveṁkaḍeśhabai kŏṁduru kalisidi viḍuvalĕm̐garuṇiṁchavalĕm̐gāga sĕlulado nĕggulĕṁchesĕluvuḍugalam̐ḍā