Title (Indic)చాలుఁ జాలు నిఁకను నీ సట లేఁటికే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలుఁ జాలు నిఁకను నీ సట లేఁటికే యీలీల నే మొక్కితేను యెగసక్కె మనవా (॥॥) ఆవలిమోమై మాటలాడ నంటా నలిగేవు చవిగాని మాట లాడ సంగతా నాకు తవిలి నీమోహ మొక్కతరుణీపై నుండ గాను వివరించి న మోహము వేడుక పుట్టీనా (॥॥) రంతుల నే నీయింటికి రానంటాఁ గొసరేవు వింత వారింటికి రాగా వేడు కయ్యీనా కాంత వేరొకతె నీకు కనుసన్న సేయఁ గాను దొంతుల మా చూపులు తొడుసులై యుండవా (॥॥) అట్టే నీతో నప్ప నైతి నంటా సిగ్గు వట్టేవు వట్టి నవ్వు నవ్వఁ బోతే వడిఁబడదా గుట్టున శ్రీ వేంకటేశ కూడితివే నన్ను నిట్టె దిట్టతనపు మా రతి తెల్లవార కుండీనా. English(||pallavi||) sālum̐ jālu nim̐kanu nī saḍa lem̐ṭige yīlīla ne mŏkkidenu yĕgasakkĕ manavā (||||) āvalimomai māḍalāḍa naṁṭā naligevu savigāni māḍa lāḍa saṁgadā nāgu tavili nīmoha mŏkkadaruṇībai nuṁḍa gānu vivariṁchi na mohamu veḍuga puṭṭīnā (||||) raṁtula ne nīyiṁṭigi rānaṁṭām̐ gŏsarevu viṁta vāriṁṭigi rāgā veḍu kayyīnā kāṁta verŏgadĕ nīgu kanusanna seyam̐ gānu dŏṁtula mā sūbulu tŏḍusulai yuṁḍavā (||||) aṭṭe nīdo nappa naidi naṁṭā siggu vaṭṭevu vaṭṭi navvu navvam̐ bode vaḍim̐baḍadā guṭṭuna śhrī veṁkaḍeśha kūḍidive nannu niṭṭĕ diṭṭadanabu mā radi tĕllavāra kuṁḍīnā.