Title (Indic)చాలుఁ జాలు నేల మాతో జాణతనాలు నాకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలుఁ జాలు నేల మాతో జాణతనాలు నాకు కోలుముందై నీపొందు జిగురువంటిదయ్యా (॥చాలు॥) చెచ్చెర నీమాఁటలు చెవియొగ్గి వినఁబోతే మచ్చిక నల్లాపె నీకె మరులాయను హెచ్చుగాఁ బదారువేల నీరీతిగడించుకొంటి తెచ్చి నీకు నెవ్వ రుపదేశమిచ్చిరయ్యా (॥చాలు॥) ముందరనుండఁగ నీమొగము చూడఁగఁబోతే అందరిలోపల నాపె ఆలాయను యిందువంకనె రేపల్లె యింతుల భ్రమించితివి సందడి నెవ్వరు నిన్నుఁ జదివించిరయ్యా (॥చాలు॥) చేరువ నీవుండఁగా నీసేవలు సేయఁగఁబోతే సారె నీవురాన నాపె సతమాయను యీరీతి శ్రీవెంకటేశ యిల్లాండ్లఁ దెచ్చుకొంటే నేరిపి యెవ్వ రింతేని నిన్ను దిద్దిరయ్యా English(||pallavi||) sālum̐ jālu nela mādo jāṇadanālu nāgu kolumuṁdai nībŏṁdu jiguruvaṁṭidayyā (||sālu||) sĕchchĕra nīmām̐ṭalu sĕviyŏggi vinam̐bode machchiga nallābĕ nīgĕ marulāyanu hĕchchugām̐ badāruvela nīrīdigaḍiṁchugŏṁṭi tĕchchi nīgu nĕvva rubadeśhamichchirayyā (||sālu||) muṁdaranuṁḍam̐ga nīmŏgamu sūḍam̐gam̐bode aṁdarilobala nābĕ ālāyanu yiṁduvaṁkanĕ reballĕ yiṁtula bhramiṁchidivi saṁdaḍi nĕvvaru ninnum̐ jadiviṁchirayyā (||sālu||) seruva nīvuṁḍam̐gā nīsevalu seyam̐gam̐bode sārĕ nīvurāna nābĕ sadamāyanu yīrīdi śhrīvĕṁkaḍeśha yillāṁḍlam̐ dĕchchugŏṁṭe neribi yĕvva riṁteni ninnu diddirayyā