Title (Indic)చాలుఁ జాలు నేతులు సటలు నీ రీతులు యీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలుఁ జాలు నేతులు సటలు నీ రీతులు యీ నీలిచేఁత పతిఁ గాక ని న్నేమనేదే (॥చాలు॥) వద్దేలె మాటలు వలవని నీటులు వొద్దనె నే మింతలేసి కోపుదు మటే యిద్దరిలో నినుఁ బెంచి యింత సేసె నాతఁడు నిద్దమై యాతనిఁ గాక ని న్నేమనేదే (॥చాలు॥) ఔనె నీ సుద్దులు ఆడెటి బద్దులు వూని యింతలేసికి నే నోపుదునటే యీ నీకుఁ జిన విచ్చి యింత సేసె నాతఁడు నే నింకా నాతనిఁ గాక ని న్నేమనేదే (॥చాలు॥) పోపో నీ కతలు పోకుల నీ గతులు వూఁపుల రాఁపుల నే నోపుదు నటే యేపున శ్రీ వెకంటేశుఁ డింతలో నన్నుఁ గూడె నీ పొందులాతనిఁ గాక ని న్నేమనేదే English(||pallavi||) sālum̐ jālu nedulu saḍalu nī rīdulu yī nīlisem̐ta padim̐ gāga ni nnemanede (||sālu||) vaddelĕ māḍalu valavani nīḍulu vŏddanĕ ne miṁtalesi kobudu maḍe yiddarilo ninum̐ bĕṁchi yiṁta sesĕ nādam̐ḍu niddamai yādanim̐ gāga ni nnemanede (||sālu||) aunĕ nī suddulu āḍĕḍi baddulu vūni yiṁtalesigi ne nobudunaḍe yī nīgum̐ jina vichchi yiṁta sesĕ nādam̐ḍu ne niṁkā nādanim̐ gāga ni nnemanede (||sālu||) pobo nī kadalu pogula nī gadulu vūm̐pula rām̐pula ne nobudu naḍe yebuna śhrī vĕgaṁṭeśhum̐ ḍiṁtalo nannum̐ gūḍĕ nī pŏṁdulādanim̐ gāga ni nnemanede