Title (Indic)చాలుఁ జాలు నే నెరంగనా నాఁడు నాఁడె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలుఁ జాలు నే నెరంగనా నాఁడు నాఁడె ఆలరి నీసుద్దు లెల్ల నన్నీఁ గంటిని (॥చాలు॥) సారె సారె నన్ను నేల పిలిచేవు యేరా నీ వలపు నే నెరఁగనిదా వూరకె యింకా నేలరా మాఁటలనె దూరేవు నీసుద్దు లెల్ల తొల్లె కంటిమి (॥చాలు॥) సన్నలు సేసే సేమిరా యెరఁగనా చిన్ననాఁడె నీ చేఁత లెల్లాను చన్నులుముట్టే వేమిరా నాలికాఁడ వున్నతి నీసుద్దు లెల్లా నిన్ననె కంటిమి (॥చాలు॥) దగ్గరి చేయి వట్టేవురా యెప్పుడును నిగ్గుల నీ చల మెల్లా నే నెరఁగనా అగ్గమై శ్రీవెంకటనాథ కడపలో దగ్గరి నన్నుఁ గూడగా తలఁ పెల్లాఁ గంటిమి English(||pallavi||) sālum̐ jālu ne nĕraṁganā nām̐ḍu nām̐ḍĕ ālari nīsuddu lĕlla nannīm̐ gaṁṭini (||sālu||) sārĕ sārĕ nannu nela pilisevu yerā nī valabu ne nĕram̐ganidā vūragĕ yiṁkā nelarā mām̐ṭalanĕ dūrevu nīsuddu lĕlla tŏllĕ kaṁṭimi (||sālu||) sannalu sese semirā yĕram̐ganā sinnanām̐ḍĕ nī sem̐ta lĕllānu sannulumuṭṭe vemirā nāligām̐ḍa vunnadi nīsuddu lĕllā ninnanĕ kaṁṭimi (||sālu||) daggari seyi vaṭṭevurā yĕppuḍunu niggula nī sala mĕllā ne nĕram̐ganā aggamai śhrīvĕṁkaḍanātha kaḍabalo daggari nannum̐ gūḍagā talam̐ pĕllām̐ gaṁṭimi