Title (Indic)చాలదా నాకింత నిన్ను సరి గన్నులఁ జూచేది WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలదా నాకింత నిన్ను సరి గన్నులఁ జూచేది వేళవచ్చినఁ దామెర విరియక మానునా (॥చాల॥) అలిగి నీవవ్వలిమోమైనా నవుదువుగాక తలపు నామీఁదనే తగులుగాదా మొలచి రత్నదీప మేమొకమై తానుండినాను వెలుఁగు ఇంటిలోనెల్ల వెలయకుండీనా (॥చాల॥) యెమ్మెల నీ విటు నన్ను నెంతవొల్లకుండినాను దిమ్ముల నీసతిననేతేజము లేదా కమ్మర శశిఁ గొన్నాళ్ళు కళలుదీసివుండినా నెమ్మది మరికొన్నాళ్లు నిండకుండీనా (॥చాల॥) పట్టినచలము మాని పంతము నాకిత్తుగాక ముట్టి నేను గతిగూడ మొక్కకుండేనా గుట్టున శ్రీవేంకటేశ కూడితివి నన్ను నిట్టె పుట్టినపూవున బిందె పొడమకుండీనా English(||pallavi||) sāladā nāgiṁta ninnu sari gannulam̐ jūsedi veḽavachchinam̐ dāmĕra viriyaga mānunā (||sāla||) aligi nīvavvalimomainā navuduvugāga talabu nāmīm̐dane tagulugādā mŏlasi ratnadība memŏgamai tānuṁḍinānu vĕlum̐gu iṁṭilonĕlla vĕlayaguṁḍīnā (||sāla||) yĕmmĕla nī viḍu nannu nĕṁtavŏllaguṁḍinānu dimmula nīsadinanedejamu ledā kammara śhaśhim̐ gŏnnāḽḽu kaḽaludīsivuṁḍinā nĕmmadi marigŏnnāḽlu niṁḍaguṁḍīnā (||sāla||) paṭṭinasalamu māni paṁtamu nāgittugāga muṭṭi nenu gadigūḍa mŏkkaguṁḍenā guṭṭuna śhrīveṁkaḍeśha kūḍidivi nannu niṭṭĕ puṭṭinabūvuna biṁdĕ pŏḍamaguṁḍīnā