Title (Indic)చాలదా ఇంత సారెసారె వలెనా । తాను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలదా ఇంత సారెసారె వలెనా । తాను యేల చలమున నిఁక నేమి సేయుమనీని (॥చాల॥) మొక్కితిఁగదె తనకు మొన్ననే నేను యెక్కడనుండిన మనసేకమని దక్కితి నంటిఁగదె తనపాలికి యిక్కడఁ జెలులమాటలెల్లాన నే వింటినే (॥చాల॥) ఇచ్చితిఁగదె పంత మింతకుముందె నాకు హెచ్చి తా నాడినమాట లియ్యకోలని మెచ్చితిఁ గదెతన్ను మీఁదమీఁదనె మరి పచ్చియెమ్మెలు నావద్దఁ బచరించనేఁటికే (॥చాల॥) అంటితిఁగదె తనఆయము నేనే ఇది దంటపాయ మిందరికిఁ దగునని గుంటిపై శ్రీవేంకటేశుఁ గూడితిఁగదె ఇఁక వెంటవెంటఁ దను నే విడువనని English(||pallavi||) sāladā iṁta sārĕsārĕ valĕnā | tānu yela salamuna nim̐ka nemi seyumanīni (||sāla||) mŏkkidim̐gadĕ tanagu mŏnnane nenu yĕkkaḍanuṁḍina manasegamani dakkidi naṁṭim̐gadĕ tanabāligi yikkaḍam̐ jĕlulamāḍalĕllāna ne viṁṭine (||sāla||) ichchidim̐gadĕ paṁta miṁtagumuṁdĕ nāgu hĕchchi tā nāḍinamāḍa liyyagolani mĕchchidim̐ gadĕdannu mīm̐damīm̐danĕ mari pachchiyĕmmĕlu nāvaddam̐ basariṁchanem̐ṭige (||sāla||) aṁṭidim̐gadĕ tanaāyamu nene idi daṁṭabāya miṁdarigim̐ dagunani guṁṭibai śhrīveṁkaḍeśhum̐ gūḍidim̐gadĕ im̐ka vĕṁṭavĕṁṭam̐ danu ne viḍuvanani