Title (Indic)చాలదా హరినామ సౌఖ్యామృతము దమకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలదా హరినామ సౌఖ్యామృతము దమకు చాలదా హితవైన చవులెల్ల నొసఁగ (॥చాలదా॥) ఇదియొకటి హరినామ మింతైనఁ జాలదా చెదరకీ జన్మముల చెఱలు విడిపించ మది నొకటె హరినామ మంత్రమది చాలఁదా పదివేలు నరకకూపముల వెడిలించ (॥చాలదా॥) కలదొకటి హరినామ కనకాద్రి చాలదా తొలఁగుమని దారిద్ర్యదోషంబు చెఱుచ తెలివొకటి హరినామ దీపమది చాలదా కలుషంపు కఠినచీఁకటి పారఁద్రోల (॥చాలదా॥) తగువేంకటేశు కీర్తన మొకటి చాలదా జగములో కల్పభూజంబు వలెనుండ సొగిసి యీ విభునిదాసుల కరుణ చాలదా నగవుఁజూపులను నున్నతమెపుడుఁ జూప English(||pallavi||) sāladā harināma saukhyāmṛtamu damagu sāladā hidavaina savulĕlla nŏsam̐ga (||sāladā||) idiyŏgaḍi harināma miṁtainam̐ jāladā sĕdaragī janmamula sĕṟalu viḍibiṁcha madi nŏgaḍĕ harināma maṁtramadi sālam̐dā padivelu naragagūbamula vĕḍiliṁcha (||sāladā||) kaladŏgaḍi harināma kanagādri sāladā tŏlam̐gumani dāridryadoṣhaṁbu sĕṟusa tĕlivŏgaḍi harināma dībamadi sāladā kaluṣhaṁpu kaṭhinasīm̐kaḍi pāram̐drola (||sāladā||) taguveṁkaḍeśhu kīrdana mŏgaḍi sāladā jagamulo kalbabhūjaṁbu valĕnuṁḍa sŏgisi yī vibhunidāsula karuṇa sāladā nagavum̐jūbulanu nunnadamĕbuḍum̐ jūba