Title (Indic)చాలా మేలుదిరా యీబాలామ ణిపుడు నీ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాలా మేలుదిరా యీబాలామ ణిపుడు నీ పాలిటఁ జిక్కెరా గోపాలక కృష్ణమ్మా (॥చాలా॥) పంకాజముఖి నీవంకా చూచి నప్పుడే పొంకాముగా వలచె యింకా నే మందురా సంకె లేక నీమీఁద నంకిత మైనపాట లంకించి పాడీ నీతో లంకెలఁ గృష్ణమ్మా (॥చాలా॥) పల్లాదమున నీవు మొల్లామి నందరిలో మొల్లాపూబంతి వేయ జల్లూనఁ గరఁగెరా మెల్లానె వ్రాసి చూచీఁ జల్లాఁగ నీ రూపమె కల్లా గాదురా శ్రీవల్లభ కృష్ణమ్మా (॥చాలా॥) తటుకానా నీ వప్పుడు నటనాలా సరసాన యిటు నటుఁ గాగిలించ నెట్లాఁ దా జొక్కెరా విటరాయఁడవు శ్రీవెంకటనాథ నీ కూటమి ఘటియించ వేడుక మిక్కుట మాయఁగృష్ణమ్మా English(||pallavi||) sālā meludirā yībālāma ṇibuḍu nī pāliḍam̐ jikkĕrā gobālaga kṛṣhṇammā (||sālā||) paṁkājamukhi nīvaṁkā sūsi nappuḍe pŏṁkāmugā valasĕ yiṁkā ne maṁdurā saṁkĕ lega nīmīm̐da naṁkida mainabāḍa laṁkiṁchi pāḍī nīdo laṁkĕlam̐ gṛṣhṇammā (||sālā||) pallādamuna nīvu mŏllāmi naṁdarilo mŏllābūbaṁti veya jallūnam̐ garam̐gĕrā mĕllānĕ vrāsi sūsīm̐ jallām̐ga nī rūbamĕ kallā gādurā śhrīvallabha kṛṣhṇammā (||sālā||) taḍugānā nī vappuḍu naḍanālā sarasāna yiḍu naḍum̐ gāgiliṁcha nĕṭlām̐ dā jŏkkĕrā viḍarāyam̐ḍavu śhrīvĕṁkaḍanātha nī kūḍami ghaḍiyiṁcha veḍuga mikkuḍa māyam̐gṛṣhṇammā