Title (Indic)చాల నొవ్వి సేయునట్టి జన్మమేమి మరణమేమి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాల నొవ్వి సేయునట్టి జన్మమేమి మరణమేమి మాలుగలపి దొరతనంబు మాన్పు టింత చాలదా (॥చాల॥) పుడమిఁ బాపకర్మమేమి పుణ్యకర్మమేమి తనకు కడపరానిబంధములకుఁ గారణంబులైనవి యెడపకున్న పసిఁడిఁసంకెలేమి యినుపసంకెలేమి మెడకుఁ దగిలియుండి యెపుడు మీఁదుచూడరానివి (॥చాల॥) చలముకొన్న ఆపదేమి సంపదేమి యెపుడుఁ దనకు అలమిపట్టి దు:ఖములకు నప్పగించినట్టిది యెలమిఁ బసిఁడిగుదియయేమి యినుపగుదియయేమి తనకు ములుగ ములుగఁ దొలితొలి మోఁదు టింత చాలదా (॥చాల॥) కర్మియైనయేమి వికృతకర్మియైననేమి దనకు కర్మఫలముమీఁదకాంక్ష గలుగు టింత చాలదా మర్మ మెరిఁగి వేంకటేశుమహిమలనుచుఁ దెలిసినట్టి నిర్మలాత్ము కిహముఁ బరము నేఁడు గలిగెఁ జాలదా English(||pallavi||) sāla nŏvvi seyunaṭṭi janmamemi maraṇamemi mālugalabi dŏradanaṁbu mānpu ṭiṁta sāladā (||sāla||) puḍamim̐ bābagarmamemi puṇyagarmamemi tanagu kaḍabarānibaṁdhamulagum̐ gāraṇaṁbulainavi yĕḍabagunna pasim̐ḍim̐saṁkĕlemi yinubasaṁkĕlemi mĕḍagum̐ dagiliyuṁḍi yĕbuḍu mīm̐dusūḍarānivi (||sāla||) salamugŏnna ābademi saṁpademi yĕbuḍum̐ danagu alamibaṭṭi du:khamulagu nappagiṁchinaṭṭidi yĕlamim̐ basim̐ḍigudiyayemi yinubagudiyayemi tanagu muluga mulugam̐ dŏlidŏli mom̐du ṭiṁta sāladā (||sāla||) karmiyainayemi vikṛtagarmiyainanemi danagu karmaphalamumīm̐dagāṁkṣha galugu ṭiṁta sāladā marma mĕrim̐gi veṁkaḍeśhumahimalanusum̐ dĕlisinaṭṭi nirmalātmu kihamum̐ baramu nem̐ḍu galigĕm̐ jāladā