Title (Indic)సాకిరులు నేము నేమే సతులు మీరడుగరే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) సాకిరులు నేము నేమే సతులు మీరడుగరే దీకొని మా నిజములు దెలుసుకోరే (॥సాకి॥) పొంచి తాను నగఁగాను బొమ్మల జంకించితిని తెంచక చెలులు పాడి దీర్చరే మీరు కంచముపొత్తుకు రాఁగాఁ గప్పురాన వేసితివి యెంచక యెవ్వరిది మేలేర్పరచరే (॥సాకి॥) పేరుకొని పిలువఁగఁ బెదవుల గొణఁగితి తేరిచి మాడుఁబాడు దిద్దరే మీరు చేరి జారించెఁ బయ్యద చేతఁ గొప్పువట్టితి సారపు మాపంతములు చక్కఁ బెట్టరే (॥సాకి॥) మోవిదానె యియ్యఁగాను మొనపల్లు సోఁకించితి శ్రీవేంకటేశునకు నాకుఁ జెప్పరే బుద్ధి దేవుఁడు తా నన్నుఁ గూడె తెలిసి నేనే మొక్కితి యేవలఁ జూచిన మీరు యిఁక నేమనేరే English(||pallavi||) sāgirulu nemu neme sadulu mīraḍugare dīgŏni mā nijamulu dĕlusugore (||sāgi||) pŏṁchi tānu nagam̐gānu bŏmmala jaṁkiṁchidini tĕṁchaga sĕlulu pāḍi dīrsare mīru kaṁchamubŏttugu rām̐gām̐ gappurāna vesidivi yĕṁchaga yĕvvaridi melerbarasare (||sāgi||) perugŏni piluvam̐gam̐ bĕdavula gŏṇam̐gidi terisi māḍum̐bāḍu diddare mīru seri jāriṁchĕm̐ bayyada sedam̐ gŏppuvaṭṭidi sārabu mābaṁtamulu sakkam̐ bĕṭṭare (||sāgi||) movidānĕ yiyyam̐gānu mŏnaballu som̐kiṁchidi śhrīveṁkaḍeśhunagu nāgum̐ jĕppare buddhi devum̐ḍu tā nannum̐ gūḍĕ tĕlisi nene mŏkkidi yevalam̐ jūsina mīru yim̐ka nemanere