Title (Indic)చాటిచెప్పితిమి నీకు జడియరాదు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) చాటిచెప్పితిమి నీకు జడియరాదు మాటలివి నాయకుఁడ మఱవరాదు (॥॥) సరసమెంతాడినాను చన్నుల నెంత వొత్తినా తరుణి కిచ్చినబాస తప్పఁగరాదు విరులనెంత వేసిన వెంగములెన్నాడినాను తిరమై చల్లినసేస తియ్యఁ గారాదు (॥॥) మునిగోర గీరెనంటా ముప్పిరిఁ బెనఁగెనంటా వనితపొందులు ఇఁక వదలరాదు కనుఁ గోన నవ్వెనంటా కడునెలయించెనంటా యెనసి కూడుండి మరి యెడయరాదు (॥॥) మంకులు చూపినందుకు మర్మము లంటినందుకు కంకణము గట్టి అతికడవరాదు లంకెలై శ్రీ వేంకటేశ్వర లలనఁ గూడితి విట్టె అంకెలవలపు లిఁక నడఁచరాదు English(||pallavi||) sāḍisĕppidimi nīgu jaḍiyarādu māḍalivi nāyagum̐ḍa maṟavarādu (||||) sarasamĕṁtāḍinānu sannula nĕṁta vŏttinā taruṇi kichchinabāsa tappam̐garādu virulanĕṁta vesina vĕṁgamulĕnnāḍinānu tiramai sallinasesa tiyyam̐ gārādu (||||) munigora gīrĕnaṁṭā muppirim̐ bĕnam̐gĕnaṁṭā vanidabŏṁdulu im̐ka vadalarādu kanum̐ gona navvĕnaṁṭā kaḍunĕlayiṁchĕnaṁṭā yĕnasi kūḍuṁḍi mari yĕḍayarādu (||||) maṁkulu sūbinaṁdugu marmamu laṁṭinaṁdugu kaṁkaṇamu gaṭṭi adigaḍavarādu laṁkĕlai śhrī veṁkaḍeśhvara lalanam̐ gūḍidi viṭṭĕ aṁkĕlavalabu lim̐ka naḍam̐sarādu