Title (Indic)సాదించరాని దొక్కటే సత్యమైన మోక్షము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) సాదించరాని దొక్కటే సత్యమైన మోక్షము సోదించితే శ్రీ హరి దాసులకే సులభము (॥సాదిం॥) బొందితో స్వర్గమునకుఁ బొయ్యేది యరుదు గాదు అంది యర్జునుఁ డుండఁడా అయిదేండ్లు అందరాదు బ్రహ్మపద మదెవ్వరి కనరాదు పొందుగా రైవతుఁడదె పోయి వుండి రాఁడా (॥సాదిం॥) జనులు సూర్యునొద్దకు చనరా దనఁగ రాదు ఘనవిక్రమార్కుఁ డేఁగి కని రాఁడా జునిఁగి మీఁదిలోకాలు చూచివచ్చే దేమి దొడ్డు యెనలేక యయాతి యిన్నిఁ జూచి రాఁడా (॥సాదిం॥) విరజానది దాఁటి విష్ణుపద మంది రాను సురలందు నరులందుఁ జూచితే నెవ్వరు లేరు యిరవైన శ్రీవేంకటేశుని మహిమ లివి గరిమె నితనినే కని కొల్వవలయు English(||pallavi||) sādiṁcharāni dŏkkaḍe satyamaina mokṣhamu sodiṁchide śhrī hari dāsulage sulabhamu (||sādiṁ||) bŏṁdido svargamunagum̐ bŏyyedi yarudu gādu aṁdi yarjunum̐ ḍuṁḍam̐ḍā ayideṁḍlu aṁdarādu brahmabada madĕvvari kanarādu pŏṁdugā raivadum̐ḍadĕ poyi vuṁḍi rām̐ḍā (||sādiṁ||) janulu sūryunŏddagu sanarā danam̐ga rādu ghanavikramārgum̐ ḍem̐gi kani rām̐ḍā junim̐gi mīm̐dilogālu sūsivachche demi dŏḍḍu yĕnalega yayādi yinnim̐ jūsi rām̐ḍā (||sādiṁ||) virajānadi dām̐ṭi viṣhṇubada maṁdi rānu suralaṁdu narulaṁdum̐ jūside nĕvvaru leru yiravaina śhrīveṁkaḍeśhuni mahima livi garimĕ nidanine kani kŏlvavalayu