Title (Indic)సాదించనేఁటికి నీవు సారెసారెకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) సాదించనేఁటికి నీవు సారెసారెకు భేదములేక కూడితే పెనఁగులాడేమా (॥సాదిం॥) చెంగటనుండి నీవు చేసినదెల్లాఁ జేయఁగా అంగనలము మాలో నేమాడుకోరాదా సంగతిగా నీవు తొల్లె సాదువలె నుండితేను పంగించి నిన్నటు భంగపరచవచ్చేమా (॥సాదిం॥) వుడివోనిచిన్నలు నీవొళ్లిమీఁద నుండంగాను నడుమ మాలో నేము నవ్వుకోరాదా సడిలేని గుణముతో చక్కఁగా మెలఁగితేను కొడిమెలు గట్టి నిన్ను కోపగించేమా (॥సాదిం॥) కప్పి యందరివి నీవు కాఁగిలించకూడఁగాను చొప్పులు మాలో నేము చూచుకోరాదా యెప్పుడూ శ్రీవేంకటేశ యెడయక యేలితేను తప్పులెంచి నీసుద్దులు తారుకాణించేమా English(||pallavi||) sādiṁchanem̐ṭigi nīvu sārĕsārĕgu bhedamulega kūḍide pĕnam̐gulāḍemā (||sādiṁ||) sĕṁgaḍanuṁḍi nīvu sesinadĕllām̐ jeyam̐gā aṁganalamu mālo nemāḍugorādā saṁgadigā nīvu tŏllĕ sāduvalĕ nuṁḍidenu paṁgiṁchi ninnaḍu bhaṁgabarasavachchemā (||sādiṁ||) vuḍivonisinnalu nīvŏḽlimīm̐da nuṁḍaṁgānu naḍuma mālo nemu navvugorādā saḍileni guṇamudo sakkam̐gā mĕlam̐gidenu kŏḍimĕlu gaṭṭi ninnu kobagiṁchemā (||sādiṁ||) kappi yaṁdarivi nīvu kām̐giliṁchagūḍam̐gānu sŏppulu mālo nemu sūsugorādā yĕppuḍū śhrīveṁkaḍeśha yĕḍayaga yelidenu tappulĕṁchi nīsuddulu tārugāṇiṁchemā